కొడుక్కి మూడు కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ .. స్పందించిన సోనూసూద్‌..

Published : Jun 21, 2021, 02:52 PM ISTUpdated : Jun 21, 2021, 02:59 PM IST
కొడుక్కి మూడు కోట్ల లగ్జరీ కారు గిఫ్ట్ .. స్పందించిన సోనూసూద్‌..

సారాంశం

మరోవైపు ఉచితంగా వైద్యం, విద్య అందించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్‌పై తాజాగా వస్తోన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఫాదర్స్ డే సందర్భంగా సోనూ సూద్‌ తనయుడికి రూ.మూడు కోట్లతో లగ్జరీ కారుని గిఫ్ట్ ని ఇచ్చాడని అంటున్నారు.

రియల్‌ హీరో సోనూ సూద్‌ గురించి ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది. ఆయన కరోనా కఠిన సమయంలో అనేక మంది కరోనా రోగులకు అందిస్తున్న సేవల గురించి ప్రజలంతా చర్చించుకుంటున్నారు. ఆయన అందిస్తున్న సహాయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఆపదలో ఉన్న రోగులకు కావాల్సిన బెడ్స్, ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆక్సిజన్‌ బెడ్స్, వెంటిలేటర్స్ అందించడం, పేదలకు ట్రీట్‌మెంట్‌ చేయించడం, ఇలా ఒక్కటేమిటి అనేక రకాల సహయసహకారాలు అందిస్తున్నారు. జనం చేత ప్రశంసలందుకుంటున్నారు. 

మరోవైపు ఉచితంగా వైద్యం, విద్య అందించే దిశగా ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సోనూ సూద్‌పై తాజాగా వస్తోన్న వార్తలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఫాదర్స్ డే సందర్భంగా సోనూ సూద్‌ తనయుడికి రూ.మూడు కోట్లతో లగ్జరీ కారుని గిఫ్ట్ ని ఇచ్చాడని అంటున్నారు. ఆ కారులో తన ఫ్యామిలీ కాసేపు చక్కర్లు కొట్టిందని సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌గా మారాయి. తాజాగా దీనిపై స్పందించారు సోనూసూద్‌. తాను తనయుడికి గిఫ్ట్ ఇవ్వలేదని స్పష్టం చేశాడు. 

`ఫొటోల్లో కనిపిస్తోన్న కారుని ట్ర‌యల్స్ కోసం తీసుకొచ్చాం. ఫాద‌ర్స్ డే రోజున పిల్ల‌లు తండ్రికి గిఫ్ట్ ఇస్తారు కానీ.. తండ్రి ఇవ్వ‌డు. ఈ విష‌యంలో నాపై వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న‌వారికి ధ‌న్య‌వాదాలు` అని తెలిపారు సోనూసూద్‌. కారు గిఫ్ట్ వార్తలను చాలా మంది నిజమేనని నమ్మినప్పటికీ తనకు మద్దతుగా మాట్లాడటం సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు సోనూసూద్‌. ఫాదర్స్‌ డే రోజున ఇద్దరి కొడుకులతో కాలక్షేపం చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అదే అమూల్యమైన కానుకగా సోనూసూద్‌ వెల్లడించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్