ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ షురూ... సెట్స్ లో రామ్ చరణ్ రచ్చ!

Published : Jun 21, 2021, 12:20 PM IST
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ షురూ... సెట్స్ లో రామ్ చరణ్ రచ్చ!

సారాంశం

చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ షురూ అయ్యాయి. కాగా ఆర్ ఆర్  ఆర్ మూవీ షూటింగ్ నేడు హైదరాబాద్ లో రీ స్టార్ట్ చేశారు. రామరాజు గా చేస్తున్న చరణ్ నేడు సెట్స్ నందు జాయిన్ అయ్యారు. 

కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు చేస్తున్నాయి. అన్ని రంగాలు చిన్నగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఇక చిత్ర పరిశ్రమలో షూటింగ్స్ షురూ అయ్యాయి. కాగా ఆర్ ఆర్  ఆర్ మూవీ షూటింగ్ నేడు హైదరాబాద్ లో రీ స్టార్ట్ చేశారు. రామరాజు గా చేస్తున్న చరణ్ నేడు సెట్స్ నందు జాయిన్ అయ్యారు. 


ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో కలిసి రామ్ చరణ్ ఫోటోకి పోజిచ్చారు. చరణ్ హెయిర్ స్టైలిష్ గా అలీమ్ హకీమ్ పనిచేస్తున్నారని అర్థం అవుతుంది. ఇక వీలైనంత త్వరగా ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. అక్టోబర్ 13 ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీగా ప్రకటించారు. సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయిన నేపథ్యంలో 2022 సంక్రాంతి విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 


ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ విడుదల రెండుసార్లు మారిన విషయం తెలిసిందే. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా బ్రిటీష్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. అలియా భట్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా అజయ్ దేవ్ గణ్ కీలక రోల్ చేస్తున్నారు. డివివి దానయ్య నిర్మాత రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌