మహేష్ విలన్ గా అర్జున్?

By team teluguFirst Published Jun 21, 2021, 12:55 PM IST
Highlights

సర్కారు వారి పాట మూవీలో కీలకమైన విలన్ రోల్ కోసం చాలా మంది నటుల పేర్లు వినిపించాయి. కన్నడ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లతో పాటు అరవింద స్వామి పేరు ప్రముఖంగా వినిపించింది. 

మహేష్ బాబు లేటెస్ట్  మూవీ సర్కారు వారి పాట. ఈ ఏడాది ప్రారంభంలో దుబాయిలో మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలు అక్కడ తెరకెక్కించారు. ఇండియాలో కూడా సర్కారు వారి పాట  షూటింగ్ కొంత జరిగింది. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సర్కారు వారి పాట షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. మరికొద్దిరోజుల్లో షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. 


కాగా సర్కారు వారి పాట మూవీలో కీలకమైన విలన్ రోల్ కోసం చాలా మంది నటుల పేర్లు వినిపించాయి. కన్నడ హీరోలు ఉపేంద్ర, సుదీప్ లతో పాటు అరవింద స్వామి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా సర్కారు వారి పాట టీమ్ లో అర్జున్ జాయిన్ కానున్నాడని వార్తలు వస్తున్నాయి. అలాగే అర్జున్ మహేష్ ని వెంటాడే క్రిమినల్ పోలీస్ గా కనిపిస్తాడనేది సదరు వార్తల సారాంశం. 


దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ జోరుగా ప్రచారం అవుతుంది. దర్శకుడు పరుశురామ్ ఆర్థిక నేరాలు ప్రధాన అంశంగా ఓ వైవిధ్యమైన కథతో సర్కారు వారి పాట తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. వరుస విజయాలతో ఊపుమీదున్న మహేష్ సర్కారు వారి పాట చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. 


 

click me!