రియల్ హీరో సోనూసూద్ పై మధ్యప్రదేశ్ కు చెందిన ఫ్యాన్స్ వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్, రియల్ హీరో సోనూ సూద్ (Sonu sood)కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నో సినిమాల్లో విలన్ గా మెప్పించి రియల్ లైఫ్ మాత్రం హీరోగా నిలిచాడు. కరోనా సమయంలో దుర్భర పరిస్థితులను ఎదురుకొన్న చాలా మందికి సాయం అందించారు. ఇప్పటికీ నిరుపేదలకు ఆయన సాయం కొనసాగుతూనే ఉంది. పేదలకు ఆర్థిక సాయం, చిన్నారులకు గుండె సంబంధిత ఆపరేషన్లు చేయిస్తూనే ఉన్నారు.
ఈ క్రమంలో సోనూసూద్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. కరోనా పరిస్థితుల నుంచి ఆయన సాయం అందుకున్న వారు ఏదో రూపంగా ఆయనపై అభిమానాన్ని చాటుకుంటున్నారు. రకరకాలుగా ఆయన ఇంటి వద్దకు చేరుకుని అభినందలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. ఆయన సేవాగుణానికి ప్రతి రాష్ట్రంలో అభిమాన సంఘాలు కూడా ఏర్పాటాయ్యాయి. ఆయనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు.
తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన సోనూసూద్ ఫ్యాన్స్ వినూత్నంగా ఆయనపై అభిమానాన్ని చాటుకున్నారు. మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో గల తుకోజీరావు పవార్ స్టేడియంలో సోనూసూద్ రూపాన్ని తీర్చిదిద్దారు. ఏకంగా ఎకరంగా పొలంలో ప్లాస్టిక్ షీట్ ను నేలపై పరిచి 2500 కేజీల బియ్యంతో సోనూసూద్ ఫేస్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. దీనిపై సోనూసూద్ స్పందిస్తూ వారి ప్రేమకు, స్వచ్ఛమైన అభిమానికి ధన్యవాదాలు తెలిపారు.
సినిమాల విషయానికొస్తే సోనూసూద్ బాలీవుడ్ తో పాటు సౌత్ లోనూ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. గతేడాది తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’లో విలన్ పాత్రలో అలరించారు. అలాగే బాలీవుడ్ నుంచి వచ్చిన ‘సామ్రాట్ ప్రుథ్వీరాజ్’లోనూ కీలక పాత్రలో అలరించారు. ప్రస్తుతం తమిళంలో రూపుదిద్దుకుంటున్న ‘తమిళరసన్’లో నటిస్తున్నారు. అలాగే హిందీలోని ‘ఫతేహ్’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
1 acre of land
2500 kgs of Rice for the needy.
And tons & tons of Pure love ❤️
Humbled beyond words.
@shubam81289781 pic.twitter.com/C6YRBnrAFV