
బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ అనుకోని ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ సెట్స్ లో ఆయనకు గాయాలైనట్లు సమాచారం అందుతుంది. ధృవ్ సర్జా హీరోగా తెరకెక్కుతున్న కేడి చిత్రంలో సంజయ్ దత్ విలన్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా భారీ పేలుడు ప్లాన్ చేశారు. ఈ పేలుడు కారణంగా సంజయ్ దత్ చేతులు, ముఖం, భుజం మీద గాయాలయ్యాయట. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సంజయ్ దత్ ప్రమాదం బారినపడ్డారట.
ప్రమాదం జరిగిన వెంటనే సంజయ్ దత్ ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స జరుగుతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. సంజయ్ దత్ క్యాన్సర్ సర్వైవర్. ఆయన సుదీర్ఘ కాలం అమెరికాలో చికిత్స తీసుకున్నారు.
కేడి చిత్రానికి ప్రేమ్ దర్శకుడు. ఈయన తెలుగులో పలు హిట్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ రక్షిత భర్త. కాగా కొన్నాళ్లుగా సంజయ్ దత్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన కెజిఎఫ్ 2లో ఆయన ప్రధాన విలన్ రోల్ చేశారు. అధీరా గా విలనిజంలో పీక్స్ చూపించారు. ఈ క్రమంలో ఆయన కన్నడ పరిశ్రమలో బిజీ అయ్యారు.