
రీసెంట్ గా ఆస్కార్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్, దీపికా పదుకునే..లాంటి స్టార్స్ అరుదైనర అవకాశాలు పొందరు. రికార్డ్ లు సృష్టించారు. ఈమధ్య మన ఇండియన్ స్టార్స్ అందరికి ఇలానే వరుసగా అరుదైన అవకాశాలు వెంటపడుతూ వస్తున్నాయి. ప్రతిష్టాత్మకమైన వేధికలపైన మనవారికి అరుదైన గౌరవాలు దక్కుతూనే ఉన్నాయి. చాలా మంది స్టార్స్ ఇండియాను ఇంటర్నేషనల్ లెవెల్ లో రీప్రెజెంట్ చేశారు,, చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కూడా అటువంటి గౌరవాన్ని అందుకుంది.
బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అనిల్ కపూర్ వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. పలుసినిమాలు చేసింది బ్యూటీ. ఆరువాతన సినిమాలు తగ్గించి 2018 లో పెళ్లి చేసుకుని..ఫ్యామిలీతో లండన్ లో ఉంటోంది. పెద్దగా సినిమాలవైపు చూడటంలేదు. రీసెంట్ గా ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో యాపిల్ సీఈవో టిమ్‌కుక్‌తో కనిపించి సందడి చేసింది బ్యూటీ. ఆ ఫోటోలు కూడా నెట్టింట గా వైరల్ అయ్యాయి. ఇక ఇఫ్పుడు ఆమెకు అరుదైన అవకాశం లభించినట్టు తెలుస్తోంది.
తాజాగా సోనమ్ కపూర్ బ్రిటన్ రాజు ఛార్లెస్-3 పట్టాభిషేకానికి ఆహ్వానం అందుకుంది. మే 6 నుంచి 8వ తేదీ వరకు పట్టాభిషేక వేడుకలు జరగనున్నాయి. పట్టాభిషేకం అయిన తరువాత రోజు జరిగే కార్యక్రమంలో హాలీవుడ్ స్టార్స్ తో పాటు సోనమ్ కపూర్ కూడా హాజరయ్యి సందడి చేయనుంది.దేశవిదేశాల నుంచి పలువురు ప్రముఖులు రానున్న ఈ వేడుకలకు ఇండియా నుంచి సోనమ్ కు మాత్రమే ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఆహ్వానం గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ..అటువంటి చారిత్రాత్మక కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందడం నాకు దక్కిన గౌరవం. ఛార్లెస్ 3 పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అన్నారు.