
వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ జీవితంలో విషాదం నెలకొంది. ఆమె మాజీ భర్త పీటర్ పాల్ మరణించారు. ఆయనతో విడిపోయినప్పటికీ మరణవార్త తెలిసి ఎమోషనల్ అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక సందేశం పంచుకున్నారు. ''ఇతరులకు సహాయం చేసిన వారికి దేవుడు సహాయం చేస్తాడని మా అమ్మ చెప్పింది. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నిజం. నీ మరణం నన్ను ఎంతగానో బాధించింది. నీ ఆత్మకు శాంతి చేకూరాలని, ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని వనిత విజయ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు.
2020లో వనిత విజయ్ కుమార్ మూడో వివాహంగా పీటర్ పాల్ ని చేసుకున్నారు. పెళ్ళైన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. పీటర్ పాల్ ని వనిత తన్ని ఇంట్లో నుండి తరిమేశారు. ఆయన మీద వేధింపుల కేసు పెట్టారు. తాగి తనను హింసించినట్లు ఆమె ఆరోపణలు చేశారు. రోజుల వ్యవధిలో పీటర్ పాల్-వనిత విజయ్ కుమార్ విడిపోయారు.
ఇక 2000లో వనిత విజయ్ కుమార్ ఆకాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఆయనతో 2007లో విడిపోయారు. అనంతరం 2007లో ఆనంద్ జయరాజన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. 2012లో అతనితో కూడా విడిపోయారు. వనిత విజయ్ కుమార్ కి ముగ్గురు సంతానం. నటుడు విజయ్ కుమార్ ఆమె తండ్రి. హీరోయిన్ మంజుల ఆమె తల్లి. విజయ్ కుమార్ తో కూడా వనితకు గొడవలు ఉన్నాయి.
బిగ్ బాస్ షోలో పాల్గొన్న వనిత విజయ్ కుమార్ కోసం పోలీసులు హౌస్లోకి వెళ్లడం సంచలనమైంది. ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉన్నారు. సీనియర్ నరేష్-పవిత్ర లోకేష్ ప్రధాన పాత్రలు చేసిన మళ్ళీ పెళ్లి చిత్రంలో వనిత విజయ్ కుమార్ కీలక రోల్ చేశారు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.