Sonakshi Sinha reacts: సల్మాన్ ఖాన్ తో పెళ్లి వార్తలపై స్పందించిన సోనాక్షీ సిన్హా...

Published : Mar 05, 2022, 10:15 AM ISTUpdated : Mar 05, 2022, 10:17 AM IST
Sonakshi Sinha reacts: సల్మాన్ ఖాన్ తో  పెళ్లి  వార్తలపై  స్పందించిన  సోనాక్షీ సిన్హా...

సారాంశం

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తో గత కొద్ది కాలంగా వస్తున్న పెళ్ళి వార్తలపై స్పందించింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. 

బాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ తో గత కొద్ది కాలంగా వస్తున్న పెళ్ళి వార్తలపై స్పందించింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. 

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో , బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ ఓ న్యూస్ ఈ మధ్య హల్ చల్ చేసింది. అంతే కాదు వీరి పెళ్ళి పోటో అంటూ నెట్టింట ఓ ఇమేజ్ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. ఈ ఫోటో చూసిన అభిమానులు ఇదేంటి.. ఎవరికీ తెలియకుండా మా అభిమాన స్టార్స్ పెళ్లి చేసుకోవడం ఏంటీఅంటూ తెగ బాధపడ్డారు. ఇండస్ట్రీతో పాటు అంతటా ఇదే చర్చ జరిగింది. 
అయితే ఈ విషయంలో చాలా మంది అనుమానం కూడా వ్యక్తం చేశారు. ఏదో తేడా కొడుతోందంటూ చర్చలు మొదలుపెట్టారు. అంత పెద్ద హీరో సడన్‌గా, ఎవరికీ చెప్పకుండా, పెళ్లి చేసుకున్నాడంటే  నమ్మబుద్ధి కావడం లేదని కామెంట్లు చేస్తున్నారు.అయితే ఈ విషయం గురించి చాలా మంది సెర్చ్ చేయడం మొదటెట్టారు. దాంతో అసలు నిజంబయట పడింది. 

సల్మాన్‌ ఓ ఇంటివాడయ్యాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు.. సోనాక్షితో వివాహం అంటూ వస్తున్న న్యూస్ లో నిజం లేదు అని తెలిసింది. సల్మాన్ ఇంకా  మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌గానే ఉన్నాడు అని తెలిసి ఫ్యాన్స్ కూల్ అయ్యారు. తమకు తెలియకుండా తమ అభిమాన స్టార్ పెళ్లి చేసుకోడు అంటూ పండగ చేసుకుంటున్నారు. ఇక నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఆ ఫొటో మార్ఫింగ్‌ ఫొటో  అయ్యుంటుందని  సినీవిశ్లేషకులు చెబుతున్నారు. 

ఇక ఈ విషయంపై తాజాగా స్పందించింది బాలీవుడ్ బ్యూటీ సోనాక్షీ సిన్హా. నెట్టింట్లో ఏది ఉంటే అది నమ్మేసే మూర్ఖులు కాదు ఆడియన్స్. అసలు అది నిజమైన ఫోటోనేనా.. లేక మార్ఫింగ్ చేశారా అనేది తెలుసుకోలేనంత ఇదిలో లేరు జనాలు అంటూ కామెంట్ చేసింది సోనాక్షి. ఆ వైరల్ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సోనాక్షీ తనకు ఎటువంటి పెళ్లి జరగలేదు అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. 
 
కాగా సోనాక్షీ సిన్హా.. 2010 లో సల్మాన్‌ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. సోనాక్షి దబాంగ్‌2 లో కూడా సల్మాన్ తో కలిసి నటించింది. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది సోనాక్షీ. ఇక సల్మాణ్ ఖాన్ కబీ ఈద్‌ కబీ దివాళి సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో  సెట్స్ పైకి వెళ్ళబోతోంది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Chiranjeeviకి ఊహించని గిఫ్ట్ తో సర్‌ప్రైజ్‌ చేసిన కృష్ణంరాజు.. మెగాస్టార్‌ మర్చిపోలేని బర్త్ డే