RGV Tweet: పవన్ సార్... కాబోయే ప్రధాని చెపుతున్నారు వినండి: రామ్ గోపాల్ వర్మ ట్వీట్

Published : Mar 05, 2022, 08:30 AM IST
RGV Tweet: పవన్ సార్... కాబోయే ప్రధాని చెపుతున్నారు వినండి:  రామ్ గోపాల్ వర్మ ట్వీట్

సారాంశం

 ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టడటం లేదు రామ్ గోపాల్ వర్మ(RGV). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కేఏ పాల్(K.A. Pual) చేసిన కామెట్స్ గురించి పవన్ కు ట్వీట్ చేశారు ఆర్జీవి. 

ఛాన్స్ దొరికితే చాలు వదిలిపెట్టడటం లేదు రామ్ గోపాల్ వర్మ(RGV). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) గురించి ట్విట్టర్ లో ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్ గా కేఏ పాల్(K.A. Pual) చేసిన కామెట్స్ గురించి పవన్ కు ట్వీట్ చేశారు ఆర్జీవి. 

జనసేన అధినేత, పవర్ స్టార్  పవన్ కల్యాణ్ (Pawan Kalyan)  పై  ఏదో ఒక ట్విట్ చేస్తూనే ఉంటారు రామ్ గోపాల్ వర్మ(RGV). పవన్ ను అనే ఛాన్స్ వస్తే వదిలిపెట్టరు ఆర్జీవి. వెంటనే తన ట్విట్టర్ కు పనిచెప్పేస్తారు. ఇలా ఏదో ఒక కామెంట్ చేస్తుండటం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV)కు అలవాటైపోయింది. 

ఎప్పుడూ పవన్ కు వ్యతిరేకంగానే ఆర్జీవి కామెంట్లు చేస్తుంటాడు.  రీసెంట్ గా రిలీజ్ అయిన భీమ్లా నాయక్(Bheemla Nayak) సినిమాపై కూడా  ఆయన సెటైరికల్ గా పలు ట్వీట్లు చేశాడు. గతంలో పవర్ స్టాన్ అంటూ ఓ సీనిమా కూడా తెరకెక్కించిన వర్మ.. చాలా సార్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ తో హడావిడి చేశాడు. ఇక  తాజాగా పవన్ కల్యాణ్ గురించి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(K.A. Pual)  మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశాడు. 

 

 

హేయ్ పవన్ సార్... కాబోయే ప్రధాని చెప్పేది వినండీ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు రామ్ గోపాల్ వర్మ(RGV).  అయితే ఈ వీడియోలో  పాల్ ఏమన్నారంటే పవన్ ఫ్యాన్స్ అందరికీ చెపుతున్నా.. పవన్ సీఎం కావాలన్నా, మినిస్టర్ కావాలన్నా.. ఆయనను ప్రజాశాంతి పార్టీలో చేరమని చెప్పండి. 42 మంది ఎంపీలను గెలిపించుకుందాం. మీరంతా ఓకే అంటే నేను ప్రధానిగా ఉంటా. పవన్ ను కావాలంటే ఆంథ్రాకు ముఖ్యమంత్రిని చేద్దాం తప్పేముంది అంటూ పాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 
 
ఈ వీడియో నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది. దీని గురించి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంత మంది పాల్ ను విమర్షిస్తుంటే.. మరికొంత మంది పాల్ తో పాటు పవన్ ను కూడా అంటున్నారు.  మరికొంత మంది మాత్రం ఆర్జీవీ(RGV)కి ఈ వీడియో భలే దొరకిందంటూ.. గుసగుసలాడుకుంటన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: జీరోకి పడిపోయి జైల్లోకి వెళ్లిన సంజనా.. భరణికి బిగ్‌ బాస్‌ బంపర్‌ ఆఫర్‌
Rajasekhar: హీరో రాజశేఖర్‌కి గాయాలు, సర్జరీ.. 36ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే టైమ్‌, షాకింగ్‌