
తెలుగు ఇండస్ర్టీ లో ఓ ప్రొడ్యూసర్ కొడకు ఆగడాలు రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. ఈ మధ్య శ్రీరెడ్డి పుణ్యమా అని టాలీవుడ్ లోని క్యాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు.అందులో ఒక ట్రాన్స్‌జెండర్ సోనా రాథోడ్ రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకొచ్చింది. ఇగో మూవీలో ఒక క్యారెక్టర్ లో నటించాను. ఆ సినిమా షుటింగ్ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు నాకు ఒక నెంబర్ పంపింది. ఈ నెంబర్ కు కాల్ చేస్తే నీకొక ఛాన్స్ రావచ్చు అని చెప్పడంతో ఆ నెంబర్ కు కాల్ చేశా. అయితే ఆ నెంబర్ ఒక బడా ప్రొడ్యూసర్ కొడుకుది అన్న విషయం నాకు తెలియదు. అయితే ఫోన్ చేస్తే స్టూడియో కి రమ్మన్నాడు.
సరే అని వెళ్లా.. అక్కడ అతను తన ఫోటోలు చూసి మీరు ట్రాన్స్‌జెండరా అని అడిగారు.. నేను అవుననే చెప్పాను. మా సినిమాలో ట్రాన్స్‌జెండర్‌ను సెక్సీగా చూపించాలనుకుంటున్నాము. నీ ఒంటిమీద రాషెష్ ఉననాయా..? లేవా..? అని చూడాలి, అవి చూసేందుకు ప్రస్తుతం మా ఆఫీస్‌లో లేడీస్ లేరు. కాబట్టి అవి నేనే చెక్ చేస్తానంటూ అతను తనపై చేతులు వేశాడని, ఆ సమయంలోనే నన్ను లొంగదీసుకున్నాడంటూ సోనా రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ పరిస్థతి చూస్తుంటే మరీ ఇంత దిగజారుడుతనం అవసరమా అంటు జనాలు దూషిస్తున్నారు.