మెగా హీరో ధైర్యం చేశాడు.. థియేటర్‌లోనే రాబోతున్నాడు!

Published : Nov 28, 2020, 04:36 PM ISTUpdated : Nov 28, 2020, 04:37 PM IST
మెగా హీరో ధైర్యం చేశాడు.. థియేటర్‌లోనే రాబోతున్నాడు!

సారాంశం

ప్రస్తుతం సాయితేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

కరోనా కారణంగా సినిమాల విడుదల ఆగిపోయాయి. థియేటర్లు సైతం మూత పడటంతో ఇన్నాళ్ళు వెయిట్‌ చేశారు. ఇక ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల ఓపెన్‌కి అనుమతినిచ్చింది. గత వారమే థియేటర్లు ఓపెన్‌ కావాల్సి ఉంది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో సాయి ధరమ్‌ తేజ్‌ ధైర్యం చేశాడు. తన సినిమాని ఓటీటీలో కాకుండా థియేటర్‌లోనే విడుదలకు సిద్దమయ్యాడు. 

ప్రస్తుతం సాయితేజ్‌ `సోలో బ్రతుకే సో బెటర్‌` అనే చిత్రంలో నటిస్తున్నాడు. సుబ్బు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు థియేటర్లు ఓపెన్‌ కావడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. డైరెక్ట్ గా ఇక థియేటర్‌లోనే విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించారు. 

డిసెంబర్‌ 25న క్రిస్‌మస్‌ కానుకగా సినిమాని విడుదల చేయబోతున్నట్టు నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, హీరో సాయితేజ్‌ అధికారికంగా ప్రకటించారు. థియేటర్‌లో సందడి చూసేందుకు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నట్టు సాయితేజ్‌ తెలిపారు. ఈ లెక్కన థియేటర్‌లో వచ్చే మొదటి పెద్ద సినిమా ఇదే కానుందని చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Kokkoroko మూవీతో అలరించేందుకు వస్తోన్న యంగ్‌ సెన్సేషన్‌.. కొత్త పోస్టర్‌ అదిరింది
Dhoolpet Police Station Review: `ధూల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌` కేస్‌ 1 వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. చూపు తిప్పుకోలేరు