వరుణ్ కోసం తను పెట్టిన రూల్ నే దిల్ రాజు అతిక్రమిస్తున్నాడా?

By Surya Prakash  |  First Published Nov 28, 2020, 3:53 PM IST

కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచేయటం చూసి అందరూ షాక్ అవుతున్నారు.



టాలీవుడ్ డైరక్టర్స్ లో హాట్ ప్లేస్ లో ఉన్నది ఎవరూ అంటే నిశ్సందేహంగా అనిల్‌ రావిపూడి అని చెప్పవచ్చు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్‌ 3 డిసెంబర్‌ 14న ప్రారంభం కానుంది. ఎఫ్‌ 2లో నటించిన వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, తమన్నా, మెహ్రీన్‌లే ఈ సీక్వెల్‌లో చేస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ఎఫ్‌ 3లో కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నారు. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రేక్షకుల చేత మరింత నవ్వులు పూయిస్తుందని ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో అనిల్‌ చెప్పుకొచ్చాచారు. ఇక ఈ మూవీ కోసం 70కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఇప్పుడు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.“ఎఫ్ 3” సినిమాకి వరుణ్ తేజ్ భారీగా రెమ్యూనరేషన్ అడుగుతున్నాడు.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం… వరుణ్ తేజ్ “ఎఫ్ 3” సినిమాకు సీనియర్ హీరో వెంకటేష్ తో సమానంగా అడుగుతున్నాడట.  దాదాపు 12 కోట్లు ఇవ్వాలి. వరుణ్ తేజ్ ఇప్పటివరకు 7 నుంచి 8 కోట్లు తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు కోట్లు ఎక్కువ పెంచేసారు. .. అలాగే తమన్నాకు 1.5కోట్లు, మెహ్రీన్‌కి 70లక్షలు, అనిల్‌ రావిపూడికి 9 కోట్లు, దేవీ శ్రీ ప్రసాద్‌కి 2 కోట్లు ఇవ్వనున్నారని సమాచారం. 

Latest Videos

ఇక ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. కరోనా కారణంగా హీరోలందరూ 20 శాతం తగ్గించాలని దిల్ రాజ్ తో కూడిన “ఆక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్” ఆదేశాలు ఇచ్చింది. కానీ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాకే హీరోలు పారితోషికాలు పెంచేయటం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇక గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్‌ 2 పెద్ద విజయం సాధించడంతో పాటు దిల్‌ రాజుకు మంచి లాభాలను తీసుకొచ్చింది. అలాగే జాతీయ స్థాయి అవార్డు కూడా దక్కించుకుంది. దాంతో పాటు నటీనటులు కూడా బాగానే డిమాండ్ చేసినట్లు టాక్‌. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌ 3కి దిల్‌ రాజు ఇంత బడ్జెట్‌ పెట్టబోతున్నట్లు సమాచారం.
  

click me!