బిగ్ బాస్ అసలు కథ మార్చేసిన సోహైల్... పాతిక అనుకుంటే 35 లక్షలు దక్కాయి!

Published : Dec 20, 2020, 09:49 PM ISTUpdated : Dec 20, 2020, 10:23 PM IST
బిగ్ బాస్ అసలు కథ మార్చేసిన సోహైల్... పాతిక అనుకుంటే 35 లక్షలు దక్కాయి!

సారాంశం

20లక్షలు రూపాయలు తీసుకొని ఒకరు వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. డబ్బులు తీసుకోవాలా లేదా అనే విషయంలో సీరియస్ గా ముగ్గురు ఆలోచించారు. 

 

అరియానా, హారిక ఎలిమినేషన్ తో టాప్ 3కి అభిజిత్, అఖిల్ మరియు సోహైల్ మిగిలారు. ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేటై బయటకి రానుండగా... ఇద్దరు టైటిల్ కోసం పోటీపడనున్నారు. కాగా ముగ్గురిలో ఒకరు ఎలిమినేటై వెళ్ళిపోతారన్న నాగార్జున... ఎవరు ఎలిమినేట్ కానున్నారో చెప్పబోయే ముందు బంపర్ ఆఫర్ ఇచ్చారు. 20లక్షలు రూపాయలు తీసుకొని ఒకరు వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇచ్చారు. డబ్బులు తీసుకోవాలా లేదా అనే విషయంలో సీరియస్ గా ముగ్గురు ఆలోచించారు. 

 
ఆ మనీని నాగార్జున 20 నుండి 25 లక్షలకు పెంచారు. దానితో సోహైల్ ఆ డబ్బులు తీసుకొని వెళ్లిపోతానని అన్నారు. ముగ్గురు కంటెస్టెంట్స్ తమ పేరెంట్స్ ని అడగడం జరిగింది. అభిజీత్, అఖిల్ పేరెంట్స్ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదు. సోహైల్ పేరెంట్స్ మాత్రం అతని నిర్ణయాన్ని సమర్ధించారు. సోహైల్ తమ్ముడు పదిలక్షలు అనాథ శరణాలయానికి ఇచ్చేటట్లు అయితే... ఆ డబ్బులు తీసుకో అన్నారు. ఇక సోహైల్ 25 లక్షల రూపాయలలో పది లక్షలు అనాథ శరణాలయానికి ఇస్తానని చెప్పి డబ్బులు తీసుకొని బయటికి వచ్చేశాడు. 
 
ఐతే సోహైల్ బిగ్ బాస్ ఇచ్చిన 25లక్షలలో ఐదు లక్షలు తన మిత్రుడు మెహబూబ్ కి ఇస్తాను అన్నాడు. తాను ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు, అనాధ శరణాలయానికి ఐదు లక్షలు ఇస్తాను అన్నాడు. ఐతే తనకు సోహైల్ ఇచ్చిన ఐదు లక్షలు మరలా తిరిగి అనాధ శరణాలయానికే ఇచ్చేస్తాను అని మెహబూబ్ అన్నాడు. వీళ్ళ స్నేహానికి ముచ్చటపడిన నాగార్జున మరో పదిలక్షలు కలిపి... మొత్తం 35లక్షలు ఇచ్చాడు.  దీనితో టైటిల్ పోరులో అఖిల్ మరియు అభిజీత్ మిగిలారు. మరి ఈ ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనే ఆసక్తి కొనసాగుతుంది. 

PREV
click me!

Recommended Stories

5000 తో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది, ప్రస్తుతం 5 నిమిషాలకు 3 కోట్లు వసూలు చేస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
Actor Sivaji: మహిళా కమిషన్‌ దెబ్బకి దిగొచ్చిన శివాజీ.. స్త్రీ అంటే మహాశక్తితో సమానం అంటూ క్షమాపణలు