బిగ్ బాస్ హౌస్ లోకి ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు హీరోయిన్ మెహ్రీన్ గెస్ట్స్ గా వెళ్లారు. అనిల్ రావిపూడి ఇంటి సభ్యులను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడిగారు. మీలో ఎవరు ఒకరి గురించి వారి వెనుక తప్పుగా మాట్లాడారు? అని అడిగారు.
ఈ ప్రశ్నకు ప్రతి ఒక్కరు కూడా ఇతరుల గురించి వారి వెనుక తప్పుగా మాట్లాడినట్లు ఒప్పుకున్నారు. దీనితో అందరూ అక్కడ ఉన్న కాకరకాయ జ్యూస్ తాగారు.నిజంగానే ప్రతి ఒక్కరు ఈ తప్పు చేసినవారే. ఇంటెషన్ ఏదైనా టాస్క్ లు మరియు గొడవల కారణంగా అందరూ మరొకరి గురించి తప్పుగా మాట్లాడారు.
ఇక టాప్ ఫైన్ నుండి మొదటగా హారిక ఎలిమినేటైంది. అందరికంటే తక్కువ ఓట్లు పొందిన హారిక అందరికంటే ముందు హౌస్ నుండి బయటికి వచ్చారు. దీనితో హౌస్లో ఇంకా నలుగురు మిగిలారు. అఖిల్, అభిజీత్, అరియానా మరియు సోహైల్ టాప్ ఫోర్ కంటెస్టెంట్స్ ఉన్నారు.