కథ వేరే లెవల్‌లో ఉంది బిగ్‌బాస్‌.. సోహైల్‌ ఆవేశం..

Published : Nov 13, 2020, 11:29 PM ISTUpdated : Nov 13, 2020, 11:30 PM IST
కథ వేరే లెవల్‌లో ఉంది బిగ్‌బాస్‌.. సోహైల్‌ ఆవేశం..

సారాంశం

సోహైల్‌ని ఉద్దేశించి `ఏందీ పంచాయితీ..` అన్నాడు బిగ్‌బాస్‌. దీనికి చాలా మంది నవ్వారు. సోహైల్‌ కూడా నవ్వుని ఆపుకుని సమాధానం చెప్పాడు. `కథ ఎట్టుంది` అని బిగ్‌బాస్‌ అడగ్గా, సోహైల్‌ స్పందిస్తూ, కథ వేరే లెవల్‌లో ఉంది సోహైల్‌ చెప్పాడు. 

బిగ్‌బాస్‌4 శుక్రవారం ఎపిసోడ్‌లో నవ్వడం నిషేధం టాస్క్ లో ఒకరు నవ్విస్తుంటే, మిగిలిన వాళ్లు నవ్వుని ఆపుకుని సీరియస్‌గా ఉండాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో భాగంగా లాస్య, అరియానా, సోహైల్‌, అవినాష్‌ నవ్వించే ప్రయత్నం చేశారు. అవినాష్‌ టైమ్‌లో చాలా మంది నవ్వారు. మధ్య మధ్యలో బిగ్‌బాస్‌ నవ్వించే ప్రయత్నం చేశాడు. 

సోహైల్‌ని ఉద్దేశించి `ఏందీ పంచాయితీ..` అన్నాడు బిగ్‌బాస్‌. దీనికి చాలా మంది నవ్వారు. సోహైల్‌ కూడా నవ్వుని ఆపుకుని సమాధానం చెప్పాడు. `కథ ఎట్టుంది` అని బిగ్‌బాస్‌ అడగ్గా, సోహైల్‌ స్పందిస్తూ, కథ వేరే లెవల్‌లో ఉంది సోహైల్‌ చెప్పాడు. ఇంకా చెబుతూ, హౌజ్‌లో జీవితం కనిపిస్తుందని, కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు, ఇలా అన్నీ ఉన్నాయన్నాడు. జీవితంలో అంటే అన్ని ఉంటాయని హౌజ్‌లోనే చూపిస్తున్నారని చెప్పాడు. జీవితంపై ధైర్యాన్నిచ్చారని, బయటకు వెళ్లాకు ధైర్యంగా ఉండొచ్చనేలా చేశారని తెలిపాడు. 

కన్నీళ్ళు, బాధలు ఉన్నాయని, చాలా ఎమోషన్స్ ఉన్నాయని, అన్ని రకాల ఫీలింగ్‌ కలిగిస్తున్నారని, అందుకు బిగ్‌బాస్‌కి థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాదు బిగ్‌బాస్‌ తన గురించి, తన మాటలను గుర్తించి తనతో మాట్లాడమే గొప్ప అని, అందుకు తాను నవ్వినా ఫర్వాలేదన్నాడు. అందుకు సంతోషిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత మెహబూబ్‌ కుందేలు గెటప్‌లో, సోహైల్‌ జోకర్ గెటప్‌లో వచ్చి నవ్వించారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి