వస్తూనే గొడవకు దిగిన పొరిగింటి సభ్యులు

Published : Sep 09, 2020, 10:58 PM ISTUpdated : Sep 09, 2020, 11:05 PM IST
వస్తూనే గొడవకు దిగిన పొరిగింటి సభ్యులు

సారాంశం

సోహైల్, ఆరియాలను బిగ్ బాస్ పొరిగింటి ఇంటి సభ్యులు అనే టాస్క్ కోసం మిగతా ఇంటి సభ్యులకు  తెలియకుండా ఓ  గదిలో ఉంచారు. వీరు తమకు కావలసిన ఫుడ్ ఇంటి సభ్యులకు ఫోన్ ద్వారా తెప్పించుకోవాల్సి ఉండగా, నోయల్ ఫోన్ పెట్టేయడంతో వారిద్దరూ ఫుడ్ లేక ఆకలితో అల్లాడారు. దీనితో హౌస్ లోకి వస్తూనే గొడవకు దిగారు. 

బిగ్ బాస్ మొత్తం ఇంటి సభ్యులలో ఇద్దరు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ మిగతా సభ్యులకు పరిచయం చేయకుండా పొరిగింటి పేరుతో ఓ గదిలో ఉంచారు. సోహైల్, ఆరియానాలను ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ ఎంచుకోవడం జరిగింది. రెండు రోజులుగా ఆ గదిలోనే ఉంటూ మిగతా ఇంటి సభ్యుల గేమ్ పరిశీలిస్తున్నారు. ఐతే వీరిద్దరూ ఆహారం మిగతా ఇంటి సభ్యులను ఫోన్ ద్వారా అడిగి తెప్పిచుకోవాలి. ఇంటి సభ్యులకు మాత్రం ఫోన్ లో ఫుడ్ అడుగుతున్న పొరుగింటి వారి గురించి తెలియదు. 

ఐతే పొరుగింటిలో ఉన్న ఆరియానా, సోహైల్ అడిగిన ఫుడ్ ఇంటి సభ్యులు ఇవ్వలేదు. వారు చెప్పే విషయం వినకుండా నోయల్ ఫోన్ కట్ చేయడంతో ఆరియానా, సోహైల్ కి ఫుడ్ లేకుండా పోయింది. దీనితో బిగ్ బాస్ వీరిద్దని వెళ్లి ఇంటి సభ్యులతో తేల్చుకోమని చెవుతాడు. 

ఇంటిలోకి ఎంటర్ అవుతూనే పరిచయ కార్యక్రమాలు కూడా లేకుండా వీరిద్దరూ తమకు అడిగిన ఫుడ్ ఎందుకు ఇవ్వలేదని ఇంటి సభ్యులను అడిగారు. ముఖ్యంగా నోయల్ ని ఫోన్ ఎందుకు కట్ చేశారు, దానివలన మేము రెండు రోజులు ఫుడ్ తినలేదని ఆవేదన పడ్డారు. నోయల్ ని సోహైల్ తప్పుబట్టగా అతను పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో అభిజిత్ మరియి సోహైల్ మధ్య వాగ్వాదం నడిచింది. 

PREV
click me!

Recommended Stories

Shilpa Shetty ఇంట్లో ఐటీ దాడులు? 60 కోట్ల మోసం విషయంలో అసలు నిజం ఏంటో తెలుసా?
మూడో వారంలో ఎలిమినేట్ కావలసిన వాడు తనూజని వాడుకుని విన్నర్ రేసులోకి వచ్చేశాడు.. భరణి సంచలన వ్యాఖ్యలు