మీరనుకుంటున్నట్లు వకీల్ సాబ్ ఉండదు..!

By Satish ReddyFirst Published Sep 9, 2020, 7:03 PM IST
Highlights

పవన్ బర్త్ డే కానుకగా వచ్చిన వకీల్ సాబ్ మోషన్ పోస్టర్ లో పవన్ ని మాస్ లుక్ లో  ప్రజెంట్ చేశారు. లాఠీ, లా బుక్ పట్టుకున్న లాయర్ గా పవన్ సీరియల్ లుక్ అదిరింది. దీనితో పవన్ కోసం వకీల్ సాబ్ కి సమూల మార్పులు చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై దర్శకుడు శ్రీరామ్ వేణు వివరణ ఇచ్చారు.

దర్శకుడు శ్రీరామ్ వేణుకు ఘనమైన ట్రాక్ రికార్డ్ లేకున్నప్పటికీ నిర్మాత దిల్ రాజు నమ్మి వకీల్ సాబ్ లాంటి భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టాడు. హీరో పవర్ స్టార్ పవన్ కావడం ఒక ఎత్తైతే, అది ఆయన కమ్ బ్యాక్ మూవీ. కాబట్టి ఫ్యాన్స్ భారీ అంచనాలను అందుకోవడం పెద్ద సవాలే.  దర్శకుడు శ్రీరామ్ వేణు పట్ల పవన్ ఫ్యాన్స్ సైతం అంత సంతృప్తికరంగా లేరు. తమ హీరో మూవీకి సరైన న్యాయం చేయగలడా అనే సందేహం వారిలో ఉంది.
 
వకీల్ సాబ్ హిందీ లో భారీ విజయం అందుకోవడంతో పాటు, విమర్శకుల ప్రశంశలు అందుకుంది. రాజకీయ నాయకుడిగా మారిన పవన్ సోషల్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఒకే చేశారు. హిందీలో ఈ పాత్రను అమితాబచ్చన్ చేయడం జరిగింది. ఆయన వయసుకు తగ్గట్టు మానసిక వ్యకల్యం కలిగిన వృద్ధ లాయర్ లా కనిపించారు. హీరోయిజం కి ఆస్కారం లేని ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఆయనకు బాగా సూట్ అయ్యింది. 

మరి పవన్ విషయానిని వస్తే మక్కీకి మక్కీ హిందీలో వలె తెరకెక్కిస్తే ఆయన ఫ్యాన్స్ కి అసలు రుచించదు. దీనితో కొన్ని కమర్షియల్ అంశాలు జోడించారు. ఫైట్స్, పాటలు పెట్టడం జరిగింది. ఇక పవన్ బర్త్ డే కానుకగా వచ్చిన మోషన్ పోస్టర్ లో సైతం పవన్ ని మాస్ లుక్ లో  ప్రజెంట్ చేశారు. లాఠీ, లా బుక్ పట్టుకున్న లాయర్ గా పవన్ సీరియల్ లుక్ అదిరింది. దీనితో పవన్ కోసం వకీల్ సాబ్ కి సమూల మార్పులు చేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై దర్శకుడు శ్రీరామ్ వేణు వివరణ ఇచ్చారు. మీరు అనుకుంటున్నట్లు ఒరిజినల్ పింక్ మూవీకి భారీ మార్పలు చేయలేదని చెప్పారు. 

click me!