చిరంజీవి సినిమా పోయిందని ప్రచారం చేసిన అల్లు రామలింగయ్య,  చరణ్ సినిమాను తోక్కేసిన అల్లు అరవింద్!

By Sambi Reddy  |  First Published Aug 27, 2024, 5:47 PM IST

అల్లు అర్జున్ తో మెగా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వార్ కొనసాగుతుంది. అల్లు రామలింగయ్య ఫ్యామిలీ మెగా హీరోలకు మంచి చేయలేదు. పైగా తొక్కేయాలని చూశారనే వాదన తెరపైకి వచ్చింది. 



మెగా హీరోల లిస్ట్ నుండి అల్లు అర్జున్ ని పక్కన పెట్టేశారు ఫ్యాన్స్. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అల్లు అర్జున్ నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలిపాడు. స్వయంగా అతనికి ఇంటికి వెళ్లి శిల్పా రవిని గెలిపించాలని కోరాడు. వైసీపీ జనసేన ప్రత్యర్థి పార్టీ కాగా మెగా ఫ్యామిలీ అసహనం వ్యక్తం చేసింది. నాగబాబు, సాయి ధరమ్ తేజ్ పరోక్షంగా అల్లు అర్జున్ పై తమ కోపాన్ని బయటపెట్టారు. చివరికి పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ కి కౌంటర్ వేశాడు. ఒకప్పుడు హీరోలు అడవులను అభివృద్ధి చేసే పాత్రలు చేసేవారు. ఇప్పుడు హీరోలు అడవులను నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. సినిమా వాడిగా ఇలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం ఉండదు, అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీని ఉద్దేశించే అని సోషల్ మీడియా టాక్. ఇటీవల మెగా హీరోలకు అల్లు అర్జున్ కౌంటర్ ఇచ్చాడు. నాకు నచ్చితే, ఇష్టమైన వస్తాను. సప్పోర్ట్ చేస్తానని మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నాడు. 

సో... మెగా ఫ్యామిలీతో యుద్దానికి సిద్దమే, వెనక్కి తగ్గేది లేదని అల్లు అర్జున్ హింట్ ఇచ్చేశాడు. సోషల్ మీడియాలో మెగా-అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. అసలు అల్లు ఫ్యామిలీ అనాదిగా మెగా హీరోలను తొక్కేయాలనే చూసిందని అర్థం వచ్చేలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒకరు ఓ వీడియో షేర్ చేశాడు. ఆ వీడియోలో రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ... స్టేట్ రౌడీ ప్లాప్ అని అల్లు రామలింగయ్య అంటుంటే చిరంజీవి తెల్ల ముఖం వేశాడు. తర్వాత ఆ మూవీ నిర్మాత శశిభూషణ్ వచ్చి స్టేట్ రౌడీ ఫస్ట్ వీక్ అద్భుతంగా వసూళ్ళు రాబట్టింది వివరించాడు. 

Latest Videos

అప్పుడు చిరంజీవి అల్లు రామలింగయ్య వైపు ఓ లుక్ ఇచ్చాడు. అంతే, అల్లు రామలింగయ్య... నాకేం తెలుసు ఎవడో అన్నాడు నేను అదే చెప్పాను, అన్నాడు... అని చెప్పుకొచ్చాడు. పరుచూరి గోపాల కృష్ణ వీడియోకు పవన్ అభిమాని... స్టేట్ రౌడీ పోయిందని అల్లు రామలింగయ్య ప్రచారం చేశాడు. ధ్రువ సినిమాకు సరైన ప్రొమోషన్స్ నిర్వహించకుండా అల్లు అరవింద్ సక్సెస్ రేంజ్ తగ్గించేశాడని, కామెంట్ చేశాడు. 

మెగా హీరోలను అల్లు ఫ్యామిలీ తొక్కేయాలనే చూసిందనే అర్థంలో పవన్ కళ్యాణ్ అభిమాని సోషల్ మీడియా పోస్ట్ ఉంది. ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. చూస్తుంటే ఇప్పట్లో మెగా-అల్లు అభిమానుల సోషల్ మీడియా వార్ ఆగేలా లేదు. పుష్ప 2ని దెబ్బ తీయాలని మెగా ఫ్యాన్స్ ఆలోచన చేస్తున్నారు. మెగా హీరోల వ్యతిరేకత పుష్ప ఫలితం పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి... 
 

చిరంజీవి గారి స్టేట్ రౌడీ సినిమా పోయిందనీ ప్రచారం చేసిన అల్లు రామలింగయ్య.

అలాగే రామ్ చరణ్ దృవ సినిమా హిట్ అయినా కూడా ప్రమోషన్లు చేయకుండా ఆ సినిమా super hit status ని చంపేసిన అల్లు అరవింద్pic.twitter.com/CkX9ZkyYV5

— Pawankalyan fan (@appusammangi)
click me!