NTR: తాతయ్యకు కొత్త గౌరవం... ఇరుకునపడ్డ జూనియర్ ఎన్టీఆర్!

By Sambi ReddyFirst Published Jan 27, 2022, 9:52 AM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కి ఓ చిక్కొచ్చి పడింది. తాతయ్య నందమూరి తారకరామారావు పేరున జూనియర్ ఎన్టీఆర్ ని కొందరు ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలా స్పందిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. కొత్తగా మరో 13 జిల్లాలు ఏర్పడ్డాయి. వాటిలో ఎన్టీఆర్ జిల్లా కూడా ఒకటి. కృష్ణా జిల్లాను విభజించి ఎన్టీఆర్ (NTR District) పేరుతొ కొత్త జిల్లా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల హామీలో భాగంగా కృష్ణాజిల్లాలో ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ కొత్త జిల్లా ఏర్పాటు కానుంది. 

ఎన్టీఆర్ అభిమానులు వైఎస్ జగన్ (YS Jagan) నిర్ణయానికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి దక్కిన గొప్ప గౌరవంగా దీనిని భావిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. టీడీపీ వర్గాలు మాత్రం దీనిపై మన్నకుండిపోయాయి. సీఎం జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కానీ, సమర్ధించడం కానీ చేయలేదు. సమర్ధిస్తే వైఎస్ జగన్ కి క్రెడిట్ ఇచ్చినట్లు అవుతుంది. విమర్శిస్తే ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ పార్టీలోని ఓ వర్గం ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. 

ఈ క్రమంలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఈ విషయంపై స్పందించవద్దని దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. చివరకు ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కూడా మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సోషల్ మీడియా బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. బావ ఆదేశించాడు కాబట్టే బావమర్థులు మౌనంగా ఉండిపోయారంటూ సెటైర్స్ వేస్తున్నారు. 

ముఖ్యంగా ఎన్టీఆర్ సోషల్ మీడియా టార్గెట్ అయ్యాడు. తాత పేరు పెట్టుకొని ఎదిగిన ఎన్టీఆర్ మీరు స్పందించరా?. మీ ఎదుగుదల కోసమే తాత కావాలా?. ఆయనకు ఓ గౌరవం దక్కింతే మాట్లాడరా? అంటూ వరుస ప్రశ్నలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరోక్షంగా ఎన్టీఆర్ పేరున కొత్త జిల్లా పేరును ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వాన్ని స్వాగతించాలని, పొగుడుతూ కనీసం ఓ ట్వీట్ చేయాలని కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ సోషల్ మీడియా దాడికి ఎలా స్పందిస్తారో చూడాలి. 

మరోవైపు ఎన్టీఆర్ బడా బడా దర్శకులతో సినిమాలు కమిటై ఉన్నారు. దర్శకుడు కొరటాల శివ ఆయన కోసం ఓ పాన్ ఇండియా సబ్జెక్టు సిద్ధం చేసి ఉంచాడు. ఈ ప్రాజెక్ట్  అధికారిక ప్రకటన కూడా జరిగిపోగా... త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ విడుదలకు సిద్ధంగా కాగా... కొరటాలతో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ ప్రకటించారు. దర్శకుడు అట్లీ, సంజయ్ లీలా భన్సాలీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. 

కాగా ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా వ్యాప్తి కారణంగా ముచ్చటగా మూడోసారి వాయిదా పడింది. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రోల్ చేస్తుండగా... చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఇటీవలే విడుదలపై క్లారిటీ ఇచ్చారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో రెండు విడుదల తేదీలు ప్రకటించారు. 

click me!