Keerthi Suresh : సొంత ఛానెల్ ఓపెన్ చేసిన కీర్తి సురేష్.. అందులో ఏం చేయబోతుందంటే..?

Published : Jan 27, 2022, 07:51 AM IST
Keerthi Suresh : సొంత ఛానెల్ ఓపెన్ చేసిన కీర్తి సురేష్.. అందులో ఏం చేయబోతుందంటే..?

సారాంశం

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthi Suresh) ఒకరు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు పక్కాగా ఫిక్స్అయ్యి ఉంటుంది.

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో కీర్తి సురేష్ (Keerthi Suresh) ఒకరు. ముఖ్యంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఈ మలయాళ ముద్దుగుమ్మ పేరు పక్కాగా ఫిక్స్అయ్యి ఉంటుంది.

సౌత్ టాప్ హీరోయిన్లలో ముందు వరసలో ఉంది కీర్తి సురేష్ (Keerthi Suresh). వరుస సినిమాలతో దూసుకుపోతోంది ముద్దుగుమ్మ. నేనూ శైలజా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్(Keerthi Suresh). వరుస సినిమాలతో బిజీగా మారిన ఈముద్దుగుమ్మ తాజాగా గుడ్ లఖ్ సఖీ మూవీ చేసింది. కరోనా వల్ల వాయిదా పడుతూ వస్తోన్న ఈసినిమా ఈ నెల 28న రిలీజ్ కాబోతోంది. నిన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఘనంగా జరిగింది.

ఇక వరుస సినిమాలు.. విజయాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్(Keerthi Suresh)  తన సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ను ఓపెన్ చేసింది. ఈవిషయాన్ని ఆమే స్వయండా ట్వీట్టర్ లో ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా తన ఛానల్ ను ప్రారంభిస్తున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉంది అన్న కీర్తి సురేష్(Keerthi Suresh).. అందరూ తప్పకుండా ఈ ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోవాలి అని కోరింది. ఇక ఈ  ఛానల్ లో తనకు సబంధంచిన షార్డ్ వీడియోస్ తో పాటు.. ఫిట్ నెస్ వీడియోస్ ను కీర్తి సురేష్ పంచుకోబోతున్నారు.
 

ఇప్పటికే కీర్తి సురేష్(Keerthi Suresh)  కు అటు సినిమాలతో పాటు సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది. ఎప్పటికప్పుడు నెట్టింట్లో తనకు సబంధించిన అన్ని అప్ డేట్స్ ను పోస్ట్ చేస్తారు కీర్తి. ప్రతీ చిన్న విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. దాంతో కీర్తి సురేష్ ను ఫాలో అయ్యేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఫాలోయింగ్ ను తన ఛానల్ కోసం ఉపయోగించుకోబోతున్నారు కీర్తి. తన ఛానల్ ద్వారా మంరింత కంటెంట్ ను ఫ్యాన్స్ కోసం అందించబోతున్నారు.

ఇక ప్రస్తుతం విమెన్ సెంట్రిక్ మూవీస్ తో పాటు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తోంది కీర్తి సురేష్(Keerthi Suresh). ఈమె నటించిన గుడ్ లక్ సఖీ రేపు రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సరసన సర్కారువారి పాట సినిమాలో నటిస్తోంది కీర్తిసురేష్ వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా తన ఖాతాలో ఉన్నాయి.  రీసెంట్ గా కోవిడ్ బారిన పడిన మహానటి.. సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయారు. ఆతరువాత తనకు నెగెటీవ్ వచ్చిందన్న కీర్తి సురేష్(Keerthi Suresh).. నెగెటివ్ అనే పదం ఇంత పాజిటీవ్ అంవుతుందని అనుకోలేదంటూ చమత్కరిస్తూ పోస్ట్ కూడా పెట్టారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..