Acharya:'ఆచార్య' అని కాకుండా ఆ టైటిల్ పెడితే సరిపోయేదంటూ సెటైర్స్

Surya Prakash   | Asianet News
Published : Apr 30, 2022, 08:00 AM IST
Acharya:'ఆచార్య' అని కాకుండా ఆ టైటిల్ పెడితే సరిపోయేదంటూ సెటైర్స్

సారాంశం

ఈ  సినిమా మూడు గంటలు ప్రేక్షకులకు నీరసం తెప్పించిందని, కొరటాల నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేదని  సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి ఫెయిల్యూర్  ఎరుగని దర్శకుడు ఆచార్య తో మొదటిసారి పరాజయాన్ని మూట కట్టుకున్నాడు.  


ఎదురుచూసిన ఆచార్య చిత్రం రానే వచ్చింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసితొలి సారి నటించటంతో హై ఎక్సపెక్టేషన్స్ తో థియోటర్స్ లో దిగాడు ఆచార్య. అయితే మార్నింగ్ షో నుంచే ఈ చిత్రానికి ప్లాఫ్ టాక్ ను అందుకుంది. అభిమానుల అంచలనాలను కొరటాల అందుకోలేకపోయాడు అని తేల్చేసారు. చిరు, చరణ్ ల లుక్స్,ఎలివేషన్స్  పై పెట్టిన దృష్టి  కొంచెం కథ మీద కూడా పెట్టి ఉంటే బావుంటుంది కామెంట్ చేస్తున్నారు. రెగ్యులర్ గా కొరటాల సినిమాలు అంటే ఎవరో ఒకరు మొదలుపెట్టిన పనిని హీరో వచ్చి పూర్తి చేస్తాడు. ఇక ఇదే తరహాలో ఆచార్య కూడా చూపించేశాడు అంటున్నారు. అయితే ఆ ఎవరో ఒకరు రామ్ చరణ్ కావటం సినిమాకు మైనస్ గా మారింది.  

అదే సమయంలో ఈ సినిమాకు అఖండ పోటు ఎక్కువైంది. ఆచార్య సినిమా చూశాక  ఎక్కువ‌శాతం జనం...ఈ సినిమాను బాల‌కృష్ణ అఖండ‌తోనే పోలుస్తున్నారు. అందులో వున్న చాలా అంశాలు ఇందులో వుండ‌డమే  అందుకు కారణం. ప్ర‌ధాన‌మైంది ధ‌ర్మాన్ని నిల‌బెట్ట‌డమే. ధ‌ర్మం గాడి త‌ప్పితే శివుని అంశ అఘోరా వ‌చ్చి ఎలా ప‌రిష్క‌రించింది అనేది అఖండ సారాంశం. చిరంజీవి ఆచార్య కూడా అలాంటిదే. కాక‌పోతే క్యారక్టరైజేషన్ న‌గ్జ‌లైట్ అనే అంశం మాత్ర‌మే. ఈ రెండు సినిమాల్లోనూ కామ‌న్ అంశం మైనింగ్ మాఫియా.  అఖండ‌లో శివుని నేప‌థ్యం అయితే ఇందులో అమ్మ‌వారి నేప‌థ్యం అంతే తేడా అంటున్నారు.  

దాంతో ఈ  సినిమా మూడు గంటలు ప్రేక్షకులకు నీరసం తెప్పించిందని, కొరటాల నుంచి ఇలాంటి ఒక కథను ఊహించలేదని  సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. మొత్తానికి ఫెయిల్యూర్  ఎరుగని దర్శకుడు ఆచార్య తో మొదటిసారి పరాజయాన్ని మూట కట్టుకున్నాడు.  అఖండలో ద‌ర్మం గాడిత‌ప్పితే దైవ‌దూత‌గా అఘోరాగా వ‌స్తాడు. మ‌రి ఆచార్య‌లో న‌గ్జ‌లైట్ వ‌స్తారా! అని రిలీజ్ కు ముందు  ఓ విలేక‌రి  ప్ర‌శ్న‌కు ద‌ర్శ‌కుడు కొంత త‌డ‌బాటు ప‌డ్డా, చిరంజీవి క‌లుగ‌జేసుకుని దైవం మానుష రూపేణ అంటూ న‌గ్జ‌లైట్ రూపంలో వ‌స్తాడంటూ వివ‌రించారు. అదే జరిగింది అంటున్నారు. ఈ సినిమాకు 'కామ్రేడ్ అఖండ'  అని టైటిల్ పెట్టినా సరిపోయేదని సెటైర్స్ వేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

2025 Flop Heroines: 2025లో ఫ్లాప్ సినిమాలతో పోటీ పడ్డ హీరోయిన్లు.. వాళ్ళిద్దరికీ మూడేసి డిజాస్టర్లు
Sobhan babu జీవితాన్ని ఒక్క సినిమాతో నిలబెట్టిన ఎన్టీఆర్, ఇంతకీ ఆ సినిమా ఏదో తెలుసా?