
`జబర్దస్త్`(Jabardasth) షోతో పాపులారిటీ సొంతం చేసుకున్న నటి రోజా(Roja)కి ఇటీవల మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. సీఎం జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీలో మంత్రి వర్గ విస్తరణలో భాగంగా ఆర్కే రోజా(RK Roja)కి మంత్రి పదవి దక్కింది. ఆమె మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక `జబర్దస్త్` షోకి గుడ్‌బై చెప్పింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)ని మర్యాద పూర్వకంగా కలిసింది రోజా. ఆయన్నుంచి ఆశీస్సులు తీసుకుంది. శుక్రవారం హైదరాబాద్‌కి వచ్చిన రోజా చిరంజీవి చిరంజీవి ఇంటికెళ్లారు.
రోజా కుటుంబ సమేతంగా చిరంజీవి ఇంటికెళ్లారు. భర్త సెల్వమణితోపాటు కూతురు, కుమారుడున్నారు. వీరికి చిరంజీవి స్వాగతం పలికారు. రోజాని హగ్ చేసుకుని విశెష్ చెప్పారు. అనంతరం వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి మంత్రి రోజాకి చిరు సత్కారం చేశారు. దీంతో రోజా తన సంతోషాన్ని పంచుకుంది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఆమె ప్రముఖులను మర్యాద పూర్వకంగా కలుస్తుంది. అందులో భాగంగా చిత్ర పరిశ్రమకి పెద్దగా ఉన్న చిరంజీవి ఆశీస్సులు తీసుకోవడం విశేషం.
మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌ని కూడా మంత్రి రోజా కలిసింది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు మంత్రి రోజా. ఈ సందర్భంగా రోజాని సత్కారించారు సీఎం. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ, కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చా, కేసీఆర్ నన్ను ఓ కూతురిగా చూస్తారు` అని తెలిపారు. రోజా టూరిజం, కల్చరల్ అండ్ యూత్ అడ్వాన్స్‌మెంట్ మంత్రిగా కొనసాగుతున్నారు.
చిరంజీవి నటించిన `ఆచార్య` చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. రామ్‌చరణ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే చరణ్‌కి జోడీగా నటించింది. ఈ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. అయితే సినిమాకి దక్కుతున్న ఆదరణ పట్ల యూనిట్ సంతోషంగా ఉంది. బాణా సంచా కాల్చి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.