పవన్ పై బండ్ల వరుస ట్వీట్స్... ఇద్దరికీ చెడిందని వార్తలు వస్తుండగా ఆసక్తికర పరిణామం!

Published : Aug 06, 2022, 03:14 PM IST
పవన్ పై బండ్ల వరుస ట్వీట్స్... ఇద్దరికీ చెడిందని వార్తలు వస్తుండగా ఆసక్తికర పరిణామం!

సారాంశం

బండ్ల గణేష్ టాలీవుడ్ లో ఓ సంచలనం. సోషల్ మీడియా వేదికగా ఆయన చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మనసులో ఏమనిపించినా అందరితో పంచుకోవడం ఆయనకు అలవాటు. తాజాగా బండ్ల హీరో పవన్ కళ్యాణ్ పై వరుస ట్వీట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని. ఒక విధంగా చెప్పాలంటే భక్తుడు. పవన్(Pawan Kalyan) పట్ల  బండ్ల వినయవిధేయతలు ఈ స్థాయిలో ఉంటాయో అందిరికీ బాగా తెలుసు. సందర్భం ఉన్నా లేకుండా పవన్ ని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేయడం బండ్లకు నచ్చిన వ్యవహారం. ఇక పవన్ హాజరైన సినిమా వేడుకల్లో బండ్లకు మైక్ ఇస్తే ఊచకోతే. పవన్ కోసం ప్రత్యేకంగా పేజీలకు పేజీలు డైలాగ్స్ గా రాసుకొచ్చి దంచి పడేస్తాడు. 

ప్రస్తుతం అలాంటి అవకాశం బండ్ల గణేష్(Bandla Ganesh) కి రావడం లేదు. పవన్ అరుదుగా సినిమా ఫంక్షన్స్ కి హాజరవుతున్నారు. అతిథిగా వచ్చిన ఆ ఒకటి రెండు ఫంక్షన్స్ కి బండ్లకు ఆహ్వానం దక్కడం లేదు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డుకుంటున్నాడంటూ బండ్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. పవన్ అభిమానితో బండ్ల మాట్లాడిన ఆడియో కాల్ లీక్ కావడంతో పెద్ద రచ్చయ్యింది. అందులో నిజం లేదని, కాల్ రికార్డు లో ఉంది తన వాయిస్ కాదని బండ్ల సమర్ధించుకున్నారు. 

అయితే తనకు అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్ గురించి బండ్ల అలాంటి వ్యాఖ్యలు చేయడం పవన్ కి నచ్చలేదు. త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ దూషించాడని నమ్ముతున్న పవన్ అతన్ని దూరం పెట్టాడనేది ఇండస్ట్రీ టాక్. ఆ సంఘటన తర్వాత పవన్, బండ్ల కలిసిన దాఖలాలు లేవు. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమేనని అందరూ నమ్ముతున్నారు. 

ఈ క్రమంలో పవన్ ని మంచి చేసుకునే ప్రయత్నాలు మాత్రం బండ్ల ఆపడం లేదు. తాజాగా బండ్ల పవన్ ని పొగుడుతూ వరుస ట్వీట్స్ వేశారు. ఓ ట్వీట్ లో.. నా దేవుడు పవన్ కళ్యాణ్ చలన చిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాసే ఓ మూవీ చేయాలని కోరుకుంటున్నాను.. అని కామెంట్ చేశారు. మరొక ట్వీట్ లో... మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రేమిస్తూ మీతో ప్రేమించబడుతూ సినిమా తీస్తే బ్లాక్ బస్టరే.. అంటూ కామెంట్ చేశాడు. ఇవన్నీ బండ్ల పవన్ కళ్యాణ్ కి దగ్గర కావడం కోసమే చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు... 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే