Rashmika Mandanna: స్టార్ లేడీ రష్మికను దారుణంగా మోసం చేసిన సీతారామం దర్శకుడు!

Published : Aug 06, 2022, 02:11 PM IST
Rashmika Mandanna: స్టార్ లేడీ రష్మికను దారుణంగా మోసం చేసిన సీతారామం దర్శకుడు!

సారాంశం

సీతారామం మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోగా... దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. సీతారామం లో మరో కీలక రోల్ చేసిన రష్మిక మాత్రం తేలిపోయారు.

సాధారణంగా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న మూవీలో స్టార్ కే కీలక రోల్ దక్కుతుంది. కొన్నిసార్లు మాత్రం ఇది రివర్స్ అవుతుంది. మహానటి మూవీలో టైటిల్ రోల్ అంతగా ఫేమ్ లేని కీర్తి సురేష్ చేయగా... స్టార్ లేడీ సమంత మాత్రం జర్నలిస్ట్ పాత్ర చేశారు. అయితే ఈ ఎంపిక వెనుక కారణం ఉంది. సావిత్రి పోలికలకు సమంత కంటే కీర్తి దగ్గరగా ఉంటుందని ఆమెకు అవకాశం ఇచ్చారు. లేటెస్ట్ రిలీజ్ సీతారామం మూవీ విషయంలో కూడా ఇదే కేస్ రిపీట్ అయ్యింది. సినిమాలో కీలకమైన సీత పాత్రను టాలీవుడ్ లో ఏమాత్రం ఫేమ్ లేని మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) కి ఇచ్చారు. స్టార్ లేడీ రష్మిక మందాన మాత్రం ముస్లిం అమ్మాయిగా సీతను అన్వేషించే రోల్ చేశారు. 

సీతారామం(Sita Ramam) రష్మిక ఒప్పుకోవడనికి ఆమె పాత్ర నిడివి మాత్రమే అని చెప్పాలి. మృణాల్ ఠాగూర్ కంటే రష్మిక పాత్రకు సినిమాలో ఎక్కువ స్పేస్ ఉంటుంది. కథలో ప్రాధాన్యత పరంగా మృణాల్ ఠాగూర్ కి ఉంది. ఇక సీతామాలక్ష్మి పాత్రలో మృణాల్ ప్రేక్షకులను కట్టిపడేసింది. దుల్కర్ సల్మాన్ తో ఆమె కెమిస్ట్రీ వెండితెరపై అద్భుతం చేయగా... మృణాల్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. మృణాల్ కి విమర్శకుల, ప్రేక్షకుల ప్రశంసలు దక్కుతున్న నేపథ్యంలో రష్మిక తేలిపోయినట్లైంది. సీతారామం అంటే రష్మిక(Rashmika mandanna) పేరు తలచిన నాథుడే లేడు. మూవీ క్రెడిట్ మొత్తం దుల్కర్, మృణాల్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 

ఈ క్రమంలో సీతారామం మూవీతో రష్మిక మందానకు అన్యాయం జరిగిందని కొందరు విశ్లేషిస్తున్నారు. స్క్రిప్ట్ నరేషన్ చూసి సినిమా అంతా తనదే అని భావించి రష్మిక పప్పులో కాలేసింది. ఇక సీతారామం ఫస్ట్ డే కలెక్షన్స్ పరిశీలిస్తే ఏమంత ఆశాజనకంగా లేవు. వరల్డ్ వైడ్ ఈ మూవీ రూ. 3.05 కోట్ల షేర్ రాబట్టినట్లు కొన్ని సైట్స్ రిపోర్ట్ చేశాయి. రూ. 16 నుండి 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సీతారామం వీకెండ్ గ్రాండ్ గా ముగించాల్సి ఉంది.  దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ స్వప్న సినిమా బ్యానర్ లో అశ్వినీ దత్ నిర్మించారు. 

PREV
click me!

Recommended Stories

Disaster Movie: 70కోట్లు పెట్టి తీస్తే, కనీసం టీ ఖర్చులు కూడా రాలేదు.. మోహన్‌లాల్‌ చెత్త సినిమా ఇదే
Illu Illalu Pillalu Today Episode March 2: నర్మదను కొట్టిన వేదవతి, ముక్కలైన రామరాజు కుటుంబం