
ఒక చిన్న సినిమా, కొత్త హీరో.. అయినా కూడా 'సెహరి'పై రిలీజ్ కు ముందు నుంచీ ప్రేక్షకుల్లో పాజిటివ్ ఫీల్ ఉంది. దానికి తోడు ట్రైలర్ ప్రామిసింగ్‌గా అనిపించడంతో సినిమాని చూడాలని కొందరు ఫిక్స్ అయ్యారు. హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా జ్ఞానసాగర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సెహరి'. ఈ సినిమా పోస్టర్ లాంచ్‌లో బాలకృష్ణ పాల్గొన్న దగ్గర నుండి దీనిపై అందరికీ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక సెహరి ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఇది మినిమమ్ గ్యారెంటీ చిత్రమని అనుకున్నారు.
లాస్ట్ వీకెండ్‌కు రవితేజ 'ఖిలాడి'కు పోటీగా సెహరి కూడా విడుదలయ్యింది. రెండు వేర్వేరు జోనర్ సినిమాలు. ఒకటి యాక్షన్ డ్రామా అయితే మరొకటి కామెడీ సినిమా. అయితే ఖిలాడి కు నెగిటివ్ రివ్యూలు అయినా వచ్చాయి. సెహరిని పట్టించుకున్న వాళ్లు లేకపోయారు. చూసిన కొద్ది మంది బాగుందన్నారు. కానీ ఎవరూ ధైర్యం చేయలేదు.
అలాగని డీజే టిల్లు లాగ జనాల్లోకి వెళ్లే కంటెంట్ కూడా లేకపోవటంతో వారం కూడా తిరక్కి ముందే జనం మర్చిపోయారు. అనుకున్నట్టుగానే ఇది ఒక టైమ్ పాస్ కామెడీ డ్రామా అయినా పట్టించుకోలేదు ప్రేక్షకులు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యిపోయింది. రిలీజ్ అయ్యి రెండు వారాలు కాకముందే ఈసినిమాని పిబ్రవరి 25 న ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ చేస్తున్నారు.
ఇక సెహరి కథ విషయానికి వస్తే.. వరుణ్ పాత్రలో కనిపించిన హర్ష్.. ఒక అమ్మాయితో బ్రేకప్ అయ్యి బాధలో ఉంటాడు. అందుకే ఇక లవ్ లాంటివి వద్దని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతాడు. అప్పుడే తన లైఫ్‌లోకి సిమ్రాన్ వస్తుంది. తనతో ప్రేమలో పడతాడు. తీరా చూస్తే.. తానే పెళ్లికూతురు అక్క అని తెలుస్తుంది. ఇక అప్పటినుండి ఈ కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో తెరపై చూడాల్సిందే. ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ జ్ఞానసాగర్ కథను హాస్యభరితంగా వివరించిన తీరు మంచిగా అనిపించింది.