
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఎవరికీ అందనంత స్థాయికి చేరుకున్నారు. బహుబలి (Bahubali) తర్వాత ఊహించన స్థాయిలో ప్రభాస్ కు వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక అప్పటి నుంచి పాన్ ఇండియా మూవీల బాట పట్టారు. అయితే ప్రభాస్ అప్ కమింగ్ భారీ బడ్జెట్ సినిమాల్లో ‘ప్రాజెక్ట్ కే’ఒకటి. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ కు జంటగా దీపికా పదుకునే (Deepika Padukone) నటిస్తున్నారు. ఈ మూవీ గురించి అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అభిమానుల్లో జోష్ పెరుగుతూనే ఉంది. ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోవడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అయితే ఇప్పటికే ‘రాధే శ్యామ్’ (Radhey shyam) మూవీని చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు ప్రభాస్ . ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ‘ఆది పురుష్’, సాలార్ (Salaar) వంటి భారీ చిత్రాలను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘ప్రాజెక్ట్ కే’ మూవీ హైదరాబాద్ లోనే షూటింగ్ ప్రారంభైంది. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ కే ఫస్ట్ డే షూటింగ్ నిన్న జరిగింది. ఈ షాట్ లో ప్రభాస్ బాలీవుడ్ బిగ్ బీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో (Amitabh bachchan)తో కలిసి నటించారు. ఇందుకు ప్రభాస్ ఎంతో ఖుషీ అవుతున్నారు.
తన ఇన్ స్టాలో అమితాబ్ బచ్చన్ త్రోబ్యాక్ పిక్చర్ ను పోస్ట్ చేశాడు ప్రభాస్. 1975లో అమితాబ్ నటించిన ‘దీవార్’లోని ఫొటోను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ‘నా కల నిజమైంది. లెజెండరీ అమితాబ్‌బచ్చన్ సర్‌తో ఈరోజు ప్రాజెక్ట్ కే మొదటి షాట్‌ను పూర్తి చేసాను’ అంటూ పేర్కొన్నాడు. అయితే అమితాబ్ బచ్చన్ తో షూట్ చేయాలన్నది ప్రభాస్ ఎన్నో ఏండ్ల కిందటి కోరిక అంట. మరోవైపు జేమ్స్ బాండ్ సినిమాలన్నా ప్రభాస్ కు చాలా ఇష్టం.
ప్రాజెక్ట్ కే మూవీలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఆడియెన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. ప్రభాస్ సినిమాలో నటిస్తుండటంతో ప్రభాస్ తో పాటు, ఆయన ఫ్యాన్స్ మరింత ఖుషీ అవుతున్నారు. ఇక అమితాబ్ బచ్చన్ కూడా ప్రభాస్ సినిమాలో నటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. సోషల్ మీడియాలో స్పందిస్తూ .. ‘మొదటి రోజు.. ఫస్ట్ షాట్.. ‘బాహుబలి’ ప్రభాస్‌తో మొదటి సినిమా.. అతని ఔరా, అతని ప్రతిభ, అతని వినయం.. ఎంతో నచ్చాయి. ఇలాంటి లక్షణాలుండటం చాలా గౌరవంగా కూడా ఉంది’ అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు బిగ్ బీ. వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై కనిపిస్తే ఇక థియేటర్ల దుమ్మురేగడం ఖాయమంటునన్నారు.
ప్రాజెక్ట్ K అనేది ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెట్స్‌లో తాజాగా ప్రభాస్, అమితాబ్ జాయిన్ అయ్యారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీ కోసం అటు ఫ్యాన్స్.. ఇటు ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు.