రహస్యంగా పెళ్లి, గర్భవతిని అంటూ ప్రకటన చేసిన స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్

Published : Oct 22, 2021, 04:53 PM IST
రహస్యంగా పెళ్లి, గర్భవతిని అంటూ ప్రకటన చేసిన స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోయిన్

సారాంశం

గర్భవతిగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు Freida pinto సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఫ్రిదా పెళ్లి వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

Slumdog millionaire ఫేమ్ ఫ్రిదా పింటో తానూ గర్భవతిని అంటూ బాంబు పేల్చారు. మెల్లగా ఆమె అసలు విషయం వెల్లడించాడు. లాక్ డౌన్ సమయంలో నిరాడంబరంగా ప్రియడు కోరి ట్రాన్ ని ఫ్రిదా పింటో వివాహం చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచారు. ఇప్పుడు ఆమె గర్భవతి కావడంతో పెళ్లి విషయాన్ని, తల్లి కాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంది. 


అవును ఇది నిజం  నా కలల  అద్భుతాన్ని నేను పెళ్లి చేసుకున్నాను. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలనుకోలేదు.. ఇద్దరమూ  జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం.. ఇప్పుడు  మీ అందరి కోసం  ఈ విషయాన్ని సంతోషంగా ప్రకటిస్తున్నాను అంటూ  భర్త కోరీ ట్రాన్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్‌  చేసింది.అలాగే గర్భవతిగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు Freida pinto సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ఫ్రిదా పెళ్లి వార్త తెలుసుకున్న ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 

Also read నాగార్జునతో లిప్ లాక్ సీన్ కి ఓకె.. కండిషన్స్ అప్లై అంటున్న అమలాపాల్ ?

ఇక 37ఏళ్ల ఫ్రిదా పింటో హాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఈ అమ్మడు  రైజ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, ఇమ్మోర్టల్స్ , గర్ల్ రైజింగ్‌, డిజెర్ట్ డ్యాన్సర్, మోగ్లీ, లెజెండ్ ఆఫ్ ది జంగిల్,  లవ్, వెడ్డింగ్, రిపీట్ అండ్ హిల్‌బిల్లీ ఎలిజీ లాంటి హిట్ చిత్రాల్లో నటించింది. అలాగే పలు మ్యూజిక్ ఆల్బమ్స్, టెలివిజన్ షోలలో నటించడం జరిగింది. 

Also read స్టయిలీష్‌ లుక్‌లో అదరగొడుతున్న ప్రభాస్‌.. `రాధేశ్యామ్‌` టీజర్‌కి ముందు స్వీట్‌ సర్‌ప్రైజ్‌లు

 ఫ్రిదా డెబ్యూ మూవీ స్లమ్ డాగ్ మిలియనీర్ ఎంత పెద్ద సంచలనమో అందరికీ తెలిసిందే. పలు అవార్డ్స్ అందుకున్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ A R rehman కి ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో లతిక అనే స్లమ్ గర్ల్ పాత్ర చేశారు ఆమె.
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
రానా దగ్గుబాటి కెరీర్ లో టాప్ 10 సినిమాలు, అస్సలు మిస్ కాకూడదు.. ఇలాంటి పాత్రలు చేయగలిగిన ఏకైక నటుడు