చుక్కలు చూపిస్తున్న ఎస్ జె సూర్య.. డిమాండ్ ఉన్నప్పుడే డబ్బు పోగేసుకుంటున్నాడుగా

By tirumala AN  |  First Published Aug 26, 2024, 1:58 PM IST

ప్రస్తుతం సౌత్ క్రేజియస్ట్ విలన్ అంటే ముందుగా వినిపించే పేరు ఎస్ జె సూర్య. విలక్షణమైన విలన్ పాత్రల కోసం దర్శకులకు సూర్య పర్ఫెక్ట్ అప్షన్ గా మారారు. స్పైడర్, మానాడు, మార్క్ ఆంటోని చిత్రాల్లో సూర్య అదరగొట్టేశారు.


ప్రస్తుతం సౌత్ క్రేజియస్ట్ విలన్ అంటే ముందుగా వినిపించే పేరు ఎస్ జె సూర్య. విలక్షణమైన విలన్ పాత్రల కోసం దర్శకులకు సూర్య పర్ఫెక్ట్ అప్షన్ గా మారారు. స్పైడర్, మానాడు, మార్క్ ఆంటోని చిత్రాల్లో సూర్య అదరగొట్టేశారు. ప్రస్తుతం సూర్య నాని సరిపోదా శనివారం చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. 

సూర్య రెమ్యునరేషన్ ప్రస్తుతం సౌత్ లో సంచలనంగా మారింది. సరిపోదా శనివారం చిత్రానికి సూర్య 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. డివివి దానయ్య అంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనుకాడలేదు. తనకి ఉన్న డిమాండ్ ని గుర్తించిన ఎస్ జె సూర్య దానిని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడట. 

Latest Videos

తన మేనేజర్ కి భారీ ప్రొడక్షన్ హౌస్ అయితేనే డీల్ సెట్ చేయాలనీ సూచించాడట. 10 కోట్లకి తగ్గకుండా రెమ్యునరేషన్ ఇవ్వగలిగే నిర్మాతల ఆఫర్స్ నే తీసుకురావాలని సూచించినట్లు తెలుస్తోంది. 

సరిపోదా శనివారం చిత్రం ఆగష్టు 29న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ హిట్ అయితే సూర్య తిరుగులేని విలన్ గా అవతరించినట్లే. ఆ తర్వాత సూర్య డిమాండ్ చేసినంత రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ సిద్ధం చేసుకోవాల్సిందే. సరిపోదా శనివారం చిత్రంలో సూర్య పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. మొత్తంగా సూర్య తన రెమ్యునరేషన్ తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా బాగా డబ్బు పోగేసుకుంటున్నాడు. 

click me!