నారా రోహిత్ ఇన్నేళ్లయినా పెళ్లి కాకపోవడానికి కారణం ఆయన చెప్పలేనన్ని పాపాలు చేశాడా? ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. పెద్ద రచ్చ లేపుతుంది.
నారా రోహిత్ ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఆ మధ్య `ప్రతినిథి 2`తో ఆడియెన్స్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఘోరంగా పరాజయం చెందింది. నారా రోహిత్ రీఎంట్రీ చేదు అనుభవంతో ప్రారంభమైంది. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు రోహిత్. తన మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ఆయన రాబోతుండటం విశేషం. `సుందరకాండ` పేరుతో ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నారా రోహిత్. ఈ మూవీ టీజర్ సోమవారం విడుదల చేశారు.
తాజాగా విడుదలైన టీజర్ ఆద్యంతం ఫన్నీగా, కామెడీ, ఎంటర్‌టైనర్‌గా సాగింది. ఇందులో నారా రోహిత్ సిద్ధార్థ పాత్రలో నటిస్తున్నాడు. ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుంటాడు. తెల్లజుట్టు వచ్చేంత ఏజ్ వచ్చినా కూడా పెళ్లి కాలేదు. దీంతో అమ్మాయి కోసం వెతుకులాట సాగుతుంది. ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లి కాలేదనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అయితే ఆయన ఏ అమ్మాయిని చూసినా ఐదు డిమాండ్స్ చేస్తుంటాడు. కట్నం మాత్రం కోరుకోడు. మరి ఆ డిమాండ్స్ ఏంటనేది అసలు సినిమా.
అయితే మీ అబ్బాయిలో ఏదైనా సమస్య ఉందా? అని పూజారి అడగ్గా, మా వాడిలో సమస్య లేదని, మా వాడితో సమస్య అని తండ్రిగా చేసిన నరేష్ చెప్పడం, నీకు కావాల్సిన క్వాలిటీస్‌తో ఎక్కడా అమ్మాయిలు దొరకరు అని సిస్టర్ రోల్‌లో చేసిన వాసుకి చెప్పడం ఫన్నీగా ఉంది. చివరగా రఘుబాబు.. వీడికి ఇన్నేళ్లు పెళ్లి కాలేదంటే పోనిలే పాపం అనుకున్నా. ఇన్ని పాపాలు చేసినందుకు అనుకోలేదు. వీడికి ఈ జన్మలో పెళ్లికాదు` అని చెప్పడం మరింత ఫన్నీగా ఉంది. ఇందులో నారా రోహిత్ చూడ్డానికి ఏజ్ డ్ లవర్ బాయ్ లా కనిపిస్తున్నాడు. తనకు ప్రారంభంలో విజయాలన్ని అందించిన ఫన్ ఎంటర్‌టైనర్‌తోనే ఇప్పుడు రాబోతున్నట్టు `సుందరకాండ` టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది.
నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్ కుమార్, వృతి వాఘాని హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నరేష్, వాసుకి, కీలక పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ చిన్నపోల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు.