ఇప్పుడు రజినీ కోసం విలన్ వేషాలు!

Published : Apr 08, 2019, 04:19 PM IST
ఇప్పుడు రజినీ కోసం విలన్ వేషాలు!

సారాంశం

ఖుషి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి సౌత్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ఎస్ జె.సూర్య ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విజయ్ లతో తో ఖుషి(తెలుగు - తమిళ్) సినిమా చేసిన సూర్య మహేష్ నాని సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

దర్శకుడిగా అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న సూర్య కొమరం పులి సినిమా ద్వారా గట్టిగా దెబ్బతిన్నాడు. ఆ తరువాత మళ్ళీ డైరెక్టర్ గా పెద్దగా మెప్పించలేకపోయాడు. అయితే నటుడిగా మాత్రం సూర్య బాగానే క్లిక్కవుతున్నాడు. సినిమాల రిజల్ట్ సంబంధం లేకుండా జనాల్లో మంచి విలన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 

మహేష్ స్పైడర్ - విజయ్ మెర్సల్ సినిమాల్లో విలన్ గా బాగా పాపులర్ అయిన సూర్య ఇప్పుడు సూపర్ స్టార్ రజిని కాంత్ సినిమాలో సరికొత్త విలన్ గా కనిపించబోతున్నాడు. మురగదాస్ దర్శకత్వం వహించబోయే సూపర్ స్టార్ పొలిటికల్ డ్రామా త్వరలోనే స్టార్ట్ కానుంది. సంగీత దర్శకుడిగా అనిరుద్ కూడా సెలెక్ట్ అయ్యాడు. మరి ఆ సినిమాలో ఎస్ జె సూర్య ఎలాంటి రూపంతో కనిపిస్తాడో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Finale: కళ్యాణ్ పడాల తలకు గాయం? సింపతీ కోసం పబ్లిసిటీ స్టంట్ చేశారా? నిజమెంత?
అయోమయంలో నందమూరి హీరోల సీక్వెల్ చిత్రాలు.. బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ముగ్గురి పరిస్థితి అంతే