'కవచ' టాస్క్ :మోహన్ లాల్ ని మరిపిస్తాడా?

Published : Apr 04, 2019, 04:09 PM IST
'కవచ'  టాస్క్ :మోహన్ లాల్ ని  మరిపిస్తాడా?

సారాంశం

ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాషలోకి డబ్బింగ్ చేయటమే రీమేక్ చేయటమో చేస్తూంటారు. 

ఒక భాషలో హిట్టైన చిత్రాన్ని మరో భాషలోకి డబ్బింగ్ చేయటమే రీమేక్ చేయటమో చేస్తూంటారు. ఎక్కువ శాతం డబ్బింగ్ చేయటానికి ఇంట్రస్ట్ చూపిస్తూంటారు.  ఎందుకంటే మళ్లీ ఆ మ్యాజిక్ రిపీట్ చేయటం కష్టమనే భావన, చాలా టైమ్, డబ్బు ముడిపడి ఉంటాయనే ఆలోచన అలా చేయిస్తుంది. అయితే రీమేక్ చేస్తే నేటివిటి వస్తుంది. తాము ఆల్రెడీ చూసి చేస్తున్న సినిమాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని సరిచేసుకోవటం జరుగుతుంది. అదే చేసారు కవచ టీమ్. 

మళయాళంలో మోహన్ లాల్, ప్రియదర్శిని కాంబినేషన్ లో వచ్చి హిట్టైన ఒప్పం చిత్రం రీమేక్ గా ఈ సినిమా రూపొంది రేపు అనగా ఏప్రియల్ 5 న విడుదల అవుతోంది. ఇక ఈ చిత్రానికి పనిచేసిన దర్శకుడు (జివిఆర్ వాసు),సినిమాటోగ్రాఫర్ (రాహుల్ శ్రీవాత్సవ) ఇద్దరూ తెలుగువాళ్లు కావటం విశేషం. ఇక ఈ చిత్రాన్ని కన్నడంలో స్టార్ హీరో శివరాజ్ కుమార్ చేసారు. దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న రీమేక్ ఇది. 

ఛాయాగ్రహణం కూడా చక్కగా కుదిరిందని తెలుస్తోంది. కెమెరా యాంగిల్స్.. విజువల్స్ గొప్పగా థ్రిల్లర్ సినిమాలకు పర్ఫెక్ట్ సూటయ్యేలా ఉన్నాయిని చెప్తున్నారు. సినిమా హైలెట్స్ అవి ఒకటిగా చెప్తున్నారు. 

చిత్రం కథ విషయానికి వస్తే....ఈ చిత్రంలో  శివరాజ్ కుమార్ అంధుడిగా నటించారు. అంధుడైన శివరాజ్ కుమర్ ఓ అపార్టెమెంట్‌ లో లిఫ్ట్‌ ఆపరేటర్‌గా పని చేస్తుంటాడు. ఓరోజు అపార్ట్‌మెంట్‌లో హత్య జరుగుతుంది. చేసిన కిల్లర్‌ తప్పించుకుంటాడు. కానీ కిల్లర్‌ను అంధుడైన శివరాజ్ ఎలా పట్టుకున్నాడు అనేది కథ. 

అంధులకు కళ్లు లేకపోవడం వల్ల మిగతా జ్నానేంద్రియాలు వాళ్లకు చాలా చురుగ్గా పని చేస్తాయి. వాళ్లకు గొప్ప పరిశీలనా శక్తి ఉంటుంది. ఆ శక్తితోనే వారు జీవనాన్ని సాగిస్తారు.  ఇప్పటిదాకా ఎంతమంది అంధుడి పాత్ర పోషించినా.. వాటన్నింటికీ భిన్నంగా కనిపిస్తుంది శివరాజ్ కుమార్ క్యారెక్టర్. అదే ఈ సినిమాకు ప్లస్ అని అంటున్నారు.  అయితే మోహన్ లాల్ ని మరిపిస్తాడా లేదా అన్నదే ప్రశ్న. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్