చరణ్ ఔట్.. 'జనసేన' ఆశలన్నీ వరుణ్, బన్నీలపైనే!

Published : Apr 04, 2019, 03:35 PM ISTUpdated : Apr 04, 2019, 03:40 PM IST
చరణ్ ఔట్.. 'జనసేన' ఆశలన్నీ వరుణ్, బన్నీలపైనే!

సారాంశం

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారా కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్ధులతో  ప్రచారాలు చేయిస్తున్నారు. 

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారా కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్ధులతో ప్రచారాలు చేయిస్తున్నారు. మరోపక్క జనసేన కూడా తామేమీ తక్కువ కాదన్నట్లుగా ప్రవర్తిస్తోంది.

పవన్ కోసం మెగాహీరోలందరూ ప్రచారంలో పాల్గొంటారని మొదటి నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకు అది జరగలేదు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు కూడా పూర్తైపోతాయి. దీంతో ఇక మెగాహీరోలు ప్రచారానికి రారని అంతా అనుకున్నారు.

పైగా చరణ్ కాలికి దెబ్బ తగలడంతో తను వచ్చే పరిస్థితి కూడా కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మెగాఫ్యామిలీ నుండి ఇద్దరు హీరోలు జనసేన పార్టీ తరఫున ప్రచారాల్లో పాల్గొంటారనే క్లారిటీ వచ్చేసింది.

జనసేన తరఫున రేపటి నుండి వరుణ్ తేజ్, అల్లు అర్జున్ లు ప్రచారం చేస్తారని నాగబాబు భార్య పద్మజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. వరుణ్ తేజ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని, రేపు తిరిగి వస్తాడని రాగానే ప్రచారంలో పాల్గొంటాడని ఆమె క్లారిటీ ఇచ్చింది. పవన్ సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తుండగా.. నాగబాబు లోక్ సభ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది