తాజా వార్తలుఎంటర్‌టైన్‌మెంట్క్రికెట్జీవనశైలిఆంధ్రప్రదేశ్తెలంగాణబిజినెస్జ్యోతిష్యంKEA 2025

BB Telugu 7: టైటిల్‌ కోసం కాదు, ఆడియెన్స్ మనసు గెలవడానికి వచ్చా.. శివాజీ స్టేట్‌మెంట్‌.. బిగ్‌బాస్‌ది తొండి

Aithagoni Raju | Published : Oct 2, 2023 11:04 PM

నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్లు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో శివాజీ మొదటగా అమర్‌ దీప్, ప్రియాంకలను నామినేట్‌ చేశారు. జులాయి సినిమా కథ చెప్పి అమర్‌ దీప్‌ని నామినేట్‌ చేయడం విశేషం. 

బిగ్‌ బాస్‌ తెలుగు 7 నాలుగు వారాలు విజయవంతంగా పూర్తయ్యాయి. నాల్గో వారంలో రతిక ఎలిమినేట్‌ అయ్యింది. 14 మందితో ప్రారంభమైన షోలో నలుగురు ఎలిమినేట్‌ అయ్యారు. ఇప్పుడు పది మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి ఐదో వారం ప్రారంభమైంది. ఇక ఎప్పటిలాగే నామినేషన్ల ప్రక్రియ సాగింది. ఇందులో ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. తేజ ఆల్ రెడీ నామినేట్ అయ్యాడు. శోభా శెట్టి, సందీప్‌, పల్లవి ప్రశాంత్‌లను నామినేట్‌ చేయడానికి లేదు. వారు పవర్‌ అస్త్ర సాధించారు. కానీ శివాజీ పవర్‌ అస్త్రని కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కూడా ఈ వారం నామినేషన్‌లోకి వచ్చారు. 

ఇక నామినేషన్ల ప్రక్రియలో కంటెస్టెంట్లు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో శివాజీ మొదటగా అమర్‌ దీప్, ప్రియాంకలను నామినేట్‌ చేశారు. జులాయి సినిమా కథ చెప్పి అమర్‌ దీప్‌ని నామినేట్‌ చేయడం విశేషం. అయితే తాను బయాస్‌గా ఉన్నాననే ఆరోపణలతో ఆయన్ని నామినేట్‌ చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య హాట్‌ హాట్‌గా వాదనలు జరిగాయి. ఆ తర్వాత ప్రియాంకని నామినేట్‌ చేశాడు. చెప్పాల్సిన కారణాలు చెప్పలేదన్నారు. ఈ క్రమంలో జరిగిన వాదనలో తాను టైటిల్‌ గెలవడానికి రాలేదని స్పష్టం చేశాడు శివాజీ. తాను ఆడియెన్స మనసులను గెలవడానికి వచ్చినట్టు తెలిపారు. నామినేషన్ల అనంతరం అంతా తొండి ఆడుతున్నారని, బిగ్‌ బాస్‌ది కూడా తొండి అంటూ ఆయన కామెంట్‌ చేయడం విశేషం. ఇది హాట్‌ టాపిక్‌అవుతుంది. 

ఇక నామినేషన్లలో ప్రియాంక.. శివాజీ, యావర్‌లను నామినేట్‌ చేసింది. కొందరు బయట మాట్లాడుకుని వచ్చారనే శివాజీ ఆరోపణలను ఆమె ఖండిస్తూ, ఆ విషయానికి తాను హార్ట్ అయ్యానని చెబుతూ నామినేట్‌ చేసింది. యావర్ తోనూ కాస్త వాదన జరిగింది. ఇక గౌతమ్‌.. అమర్‌ దీప్‌, శివాజీలను నామినేట్‌ చేశాడు. ఓటమిని అమర్‌ దీప్‌ తీసుకోలేకపోతున్నాడని తెలిపారు. శుభ శ్రీ చెబుతూ, అమర్‌ దీప్‌, ప్రియాంకలను నామినేట్‌ చేసింది. బయాస్ అని చెప్పి నా టాలెంట్‌ని హర్ట్ చేశారని శుభశ్రీ ఆరోపించింది. యావర్‌.. అమర్‌ దీప్‌, ప్రియాంకలను నామినేట్‌ చేశాడు. 

అమర్‌ దీప్‌.. శుభ శ్రీ, శివాజీలను నామినేట్‌ చేశాడు. తేజ.. గౌతమ్‌, యావర్‌లను నామినేట్‌ చేశాడు. అయితే బిగ్‌ బాస్‌ దీనిపై స్పందిస్తూ.. నాలుగు వారాలైన బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కాలేకపోయారని, మిమ్మల్ని, మీ ఆట తీరుని ఆడియెన్స్ కూడా చూస్తున్నారని చెప్పి అందరిని నామినేట్‌ చేశాడు బిగ్‌బాస్‌. దీంతో శివాజీ, తేజతోపాటు శుభ శ్రీ, యావర్‌, అమర్‌ దీప్‌, ప్రియాంక, గౌతమ్‌లు ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించిన నామినేషన్‌లో ఉన్నారు. అయితే నామినేషన్ల ప్రక్రియ చాలా చప్పగా సాగింది. దీంతో సరైన కారణాలు కంటెస్టెంట్లు చెప్పలేకపోవడం విచారకరం. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!