
Bigg BossTelugu 7 Grand Finale ఎపిసోడ్ రేపు (ఆదివారం) ప్రసారం కానుంది. ఇప్పటి వరకు హౌజ్ లో ఆరుగురు కంటెస్టెంట్లు.... శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, యావర్, ప్రియాంక, అర్జున్ అంబటి ఉన్నారు. వంద రోజులుగా టీవీ ప్రేక్షకులను అలరించిన వీరిలో టైటిల్ ఎవరు గెలుచుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో ఇప్పటికే గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూట్ కూడా పూర్తైంది. కానీ టైటిల్ విన్నర్ ఎవరనేది తెలియకుండా నాగార్జున చాలా జాగ్రత్త పడుతున్నారు.
కానీ ఇన్ సైడ్ నుంచి ఉన్న ఇన్ఫో ప్రకారం... బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 టైటిల్ రేస్ నుంచి శివాజీ (Sivaji) కూడా సైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్ ఎలిమినేట్ అయ్యారని, యావర్ రూ.15 లక్షల ఆఫర్ కు తలొగ్గాడని, ప్రియాంకను రవితేజ ఎలిమినేట్ చేశారని అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth), అమర్ దీప్, శివాజీ రేసు ఉన్నారు. ఇక తాజా సమచారం ప్రకారం.. టైటిల్ పక్కా తనదేనన్న శివాజీ కూడా ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. హౌజ్ లో అందరికీ పెద్దదిక్కుగా ఉన్న శివాజీ కనీసం రన్నరప్ గా కూడా లేకుండా మూడో స్థానంలో ఎలిమినేట్ అవడం ఆశ్చర్యకరంగా ఉంది.
ఈ విషయాలన్నీ రేపు టెలికాస్ట్ కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో కనిపించనున్నాయి. మొత్తానికి ప్రస్తుతం Amardeep మరియు పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటి ఉంది. కానీ ఈరోజు ఉదయం వచ్చిన ఓటింగ్ ఆర్డర్ ప్రకారం.. పల్లవి ప్రశాంత్ కు టైటిల్ దక్కే అవకాశం ఉంది. ఇక రేపటితో ఈ ఊహాగానాలన్నింటికి తెరపడనుంది. విజేతను ప్రకటన జగనుంది. ఇక ఫినాలే ను చాలా గ్రాండ్ గా ప్లాన్ చేశాంట. యాంకర్ శ్రీముఖి, హీరోయిన్ నిధి అగర్వాల్ డాన్స్, మాస్ మహారాజా ఎంట్రీ కూడా ఉంటుందని తెలుస్తోంది.