Salaar : ‘సలార్’ సెకండ్ ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Published : Dec 16, 2023, 08:35 PM ISTUpdated : Dec 16, 2023, 08:37 PM IST
Salaar :  ‘సలార్’ సెకండ్ ట్రైలర్ కు ముహుర్తం ఫిక్స్..  ఎప్పుడంటే?

సారాంశం

‘సలార్’ ప్రమోషన్స్ ను ప్రారంభించిన యూనిట్ తాజాగా అభిమానులు మరో గుడ్ న్యూస్ కు రెడీ అయ్యింది. సలార్ సెకండ్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  - సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రాబోతున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’. ఈ  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి మొదటి పార్ట్ Salaar Cease Fire గా రిలీజ్ కాబోతోంది. రిలీజ్ కు మరో ఆరు రోజులే సమయం ఉంది. ఈ సందర్బంగా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. దీంతో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఇప్పటికే సంబంధించిన టీజర్, ట్రైలర్ ను విడుదల చేసి ప్రపంచ ప్రేక్షకులను తమవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. 

అయితే, మొన్నటి ట్రైలర్ లో ప్రభాస్ ను పెద్దగా చూపించకపోవడంతో అభిమానులు కాస్తా అప్సెట్ అయ్యారు. దీంతో సెకండ్ ట్రైలర్ కూడా  ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆ ట్రైలర్ ను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. Salaar Release Trailer గా డిసెంబర్ 17 (రేపు)  ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రోజేదీనిపై అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. రేపు ట్రైలర్ రాబోతోంది. దీంతో అభిమానులను ఖుషీ  చేయనున్నారు. 

ఇక ప్రభాస్, ప్రశాంత్ నీల్ మొత్తానికి ప్రమోషన్స్ ను షురు చేయడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా హైప్ పెరిగింది. అడ్వాన్డ్స్ బుకింగ్స్ కు కూడా మాసీవ్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డికీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

400 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన టాప్ 5 సినిమాలు ఇవే
Rashmi Gautam Marriage: యాంకర్‌ రష్మి పెళ్లి వార్త.. చేసుకునేది అతన్నే