దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు సాధించిన సీతారామం సినిమా, కేటగిరి ఏంటంటే..?

Published : May 02, 2023, 06:54 AM ISTUpdated : May 02, 2023, 07:09 AM IST
దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్  అవార్డు సాధించిన సీతారామం సినిమా, కేటగిరి ఏంటంటే..?

సారాంశం

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమానే  సీతారామం.  బాక్సాఫీస్‌ పైకి సైలెంట్ ఎటాక్ ఇచ్చిన ఈసినిమా .. తాజాగా మరో రికార్డ్ ను తన ఖాతాలో వేసుకుంది. 

కొన్నిసినిమాలు సైలెంట్ గా వచ్చి.. సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి.  అలాంటి సినిమానే సీతారామం.  ఎలాంటి అంచనాల్లేకుండా బాక్సాఫీస్‌ దగ్గర బ్లాస్టింగ్ ఫీట్లు చేసిందీ సీతారామం. దుల్కర్ సల్మాన్ హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా..  తెలుగు మార్కేట్ పై దండయాత్ర చేసిన సినిమా ఇది.  హనురాఘవపూడి డైరెక్ట్ చేసిన ఈసినిమాతో దుల్కర్ టాలీవుడ్ లో సోలో హీరోగా నిలబడాలి అని  అనుకున్నది సాధించాడు.. మృణాల్ కూడా వరుస ఆఫర్లను సాధిస్తోంది. ఇక ఈసినిమాలో స్పెషల్ క్యారెక్టర్ లో హీరోయిర్ రష్మిక నటించి అద్భుతం చేసింది. అటు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కూడా రష్మికతో కలిసి మూవీ ఇమేజ్ ను సైలెంట్ గా పెంచాడు. 

వరుసఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడుతున్న హనురాఘవపూడికి  ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. ఇవిమర్శకులు ప్రశంసలు పొందిన ఈ సినిమా కలెక్షన్స్ రికార్డులు సృష్టించడంతో పాటు, తాజాగా అరుదైన ఘనత కూడా సాధించింది. ఇండియన్ యాక్టర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే  దాదా సాహెబ్‌ ఫాల్కే ఫెస్టివల్  అవార్డును సీతారామం మూవీ గెలుచుకుంది. దాంతో మూవీ టీమ్ సంబరాల్లో మునిగిపోయింది. 

 

పదమూడవ దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో స్పెషల్ జ్యూరి కేటగిరీలో సీతారామం ఉత్తమ సినిమా  అవార్డు అందుకుంది. క్లాసిక్ లవ్‌స్టోరీగా వచ్చిన సీతారామం ఇంత గొప్ప అవార్డు అందుకోవడంతో.. మూవీటీమ్ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. రికార్డ్ స్థాయిలో కలెక్షన్లతో పాటు.. ఇలా అరుదైన అవార్డ్ నుకూడాసాధించడంతో మూవీ టీమ్ సంతోషంలోమునిగిపోయి ఉన్నారు.  ఈవిషయాన్ని తెలియజేస్తూ.. ఈసినిమాను నిర్మిస్తున్న వైజయంతీ మూవీస్ స్పెషల్ గా సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేశారు. 

ఇక ఈసినిమాలో దుల్కర్‌ సల్మాన్, మృనాల్ ఠాకూర్ నటనకు తెలుగు ప్రేక్షకులు పిదా అవ్వగా..  డైరెక్టర్‌ హను రాఘవపూడి  టేకింగ్‌, విజన్‌కు ఆడియన్స్ మోస్మరైజ్ అయ్యారు. ఇక దాంతో ఈ ముగ్గుురికి టాలీవుడ్ లో మంచి మంచి ఆఫర్లువెతుక్కుంటూ వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ నెక్ట్స్ తెలుగు ప్రాజెక్ట్ ఫిక్స్ అవ్వలేదు కాని..రకరకాల రూమర్లు మాత్రం తిరుగుతున్నాయి. మృణాల్ మాత్రం నాని జోడీగా నాని30 లో నటిస్తోంది. ఇక హను రాఘవపూడి కూడా భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే