నాగచైతన్య తాజా చిత్రం ‘కస్టడీ’ Custody. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ పై అప్డేట్ అందించింది.
నాగచైతన్య కేరీర్ లో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో అలరించబోతున్న చిత్రం Custody. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా రూపుదిద్దుకుంటోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత చిత్తూరి శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. మరికొద్దిరోజుల్లో థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.
ఇక తాజాగా Custody Trailerపై మేకర్స్ అప్డేట్ అందించారు. ట్రైలర్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేస్తూ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. మే5న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ట్రైలర్ పై ఆసక్తిని పెంచుతోంది. టీజర్ ను మించి ట్రైలర్ మరింత పవర్ ఫుల్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. చైతూ ఓ చేతికి హ్యాండ్ కప్స్, మరో చేతిలో గన్ పట్టుకొని ఓ గ్రౌండ్ లో నిలుచున్న పోస్ ఆసక్తికరంగా ఉంది.
పోలీస్ ఆఫీసర్ గా అలరించబోతున్న చైతూ చేతికి హ్యాండ్ కప్స్ ఎందుకు వేశారనేది ట్రైలర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో చైతూ అభిమానులు ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ‘నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్ దట్ ట్రూత్ ఇన్ మై కస్టడీ’ అంటూ నాగచైతన్య టీజర్ లో చెప్పిన డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. ఈక్రమంలో ట్రైలర్ అప్డేట్ రావడం ఆసక్తికరంగా మారింది.
చైతూకు జోడీగా కృతి శెట్టి అలరించనుంది. 'బంగార్రాజు' తర్వాత వీరిద్దరూ జంటగా అలరించబోతున్నారు. ఇళయరాజా .. ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించారు. శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్ పాత్ర పోషిస్తున్నారు. మే12 చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
The Hunting Season Begins 🔥 Explodes on May 5th!❤️🔥 pic.twitter.com/7aDFqqpj1L
— Srinivasaa Silver Screen (@SS_Screens)