రష్మిక, దుల్కర్‌ల`సీతారామం` ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. అసలు స్టోరీ ఇదేనట..

Published : Jul 23, 2022, 08:14 PM ISTUpdated : Jul 23, 2022, 08:16 PM IST
రష్మిక, దుల్కర్‌ల`సీతారామం` ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్.. అసలు స్టోరీ ఇదేనట..

సారాంశం

 ట్రైలర్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. `సీతా రామం` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది యూనిట్‌. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేసింది. 

దుల్కర్‌ సల్మాన్‌(dulquer Salman), మృణాల్‌ ఠాకూర్‌ జంటగా, రష్మిక మందన్నా (Rashmika Mandanna) కీలక పాత్రలో నటించిన చిత్రం `సీతా రామం`(Sita Ramam). హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. వైజయంతి మూవీస్‌ సమర్పణలో, స్వప్న సినిమాస్‌ పతాకంపై అశ్వనీదత్‌ నిర్మించిన చిత్రమిది. ఆగస్ట్ 5న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరు పెంచారు. 

తాజాగా ట్రైలర్‌ డేట్‌ని ఫిక్స్ చేశారు. సోమవారం `సీతా రామం` ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు తెలిపింది యూనిట్‌. ఈ సందర్భంగా ఓ స్పెషల్‌ వీడియోని విడుదల చేసింది. ట్రైలర్‌ ఎప్పుడూ అని రష్మికని మీడియాసంస్థలు ప్రశ్నిస్తున్నట్టుగా, ఆమెకి తెలియక తికమక పడటం, మరోవైపు ట్రైలర్‌ ఎప్పుడు అని మృణాల్‌ ఠాకూర్‌(సీత పాత్ర) అటు దర్శకుడు హను రాఘవపూడిని అడుగుతుంటుంది. ఆయన బిజీగా ఉండటంతో మరోవైపు హీరో దుల్కర్‌ సల్మాన్‌(రామ్‌)కి ఫోన్‌ చేస్తుంది ఆయన డబ్బింగ్‌లో బిజీగా ఉన్నట్టు చెబుతాడు. ఫైనల్‌గా జులై 25న ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

అయితే ఈ సందర్భంగా కొన్నిఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమాని తెలుగు, మలయాళంతోపాటు తమిళంలో విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. అంతేకాదు మూడు భాషల్లోనూ దుల్కర్‌ సల్మాన్‌ తన పాత్రకి తనే డబ్బింగ్‌ చెబుతున్నాడట. డబ్బింగ్‌ చెప్పి చెప్పి తన అలసిపోయినట్టుగా చూపించారు. ఇప్పుడు మూడు భాషల్లో ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తున్నారు. ట్రైలర్‌ కి కూడా మూడు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాలనడంతో షాక్‌ అయ్యాడు దుల్కర్‌. తన వల్ల కాదన్నట్టుగా ఆయన డీలా పడిపోవడం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. 

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి దర్శకుడు హను రాఘవపూడి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ కథ ఎలా పుట్టిందో తెలిపారు. తనకు పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉందని, అలా కోఠిలో కొన్న పుస్తకంలో ఓ లెటర్‌ కనిపించిందట. అది ఓపెన్‌ చేయని లెటర్‌. ఓ కుమారుడికి తల్లి రాసిన లేఖ. అందులో పెద్దగా విషయమేమీ లేదట. కానీ ఏదైపా ఇంపార్టెంట్‌ ఉండి ఉంటే, జీవితాన్ని మలుపుతిప్పే విషయం ఉంటే పరిస్థితి ఏంటి? అనే ఆలోచనలోనుంచి `సీతా రామం` కథ పుట్టిందని తెలిపారు దర్శకుడు హను రాఘవపూడి. 

అయితే టైటిల్‌లో ఉన్నట్టు `యుద్దంతో రాసిన ప్రేమ కథ`అనే క్యాప్షన్‌ గురించి చెబుతూ, సినిమా యుద్ధ నేపథ్యంలో జరిగే కథ కాదని, పాత్రల జర్నీ యుద్ధాన్ని తలపించేలా ఉంటుందన్నారు. రాముడు,రావణుడిని చంపడం యుద్ధం కాదని, కానీ రావణ సంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం, సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం ఈ చిత్రంలో ఉంటుందని, అదే యుద్ధంతో రాసిన ప్రేమ కథ అని తెలిపారు. సినిమాలో రష్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, ముఖ్యమైన టైమ్‌లో కథని మలుపుతిప్పేలా ఆమె పాత్ర ఉంటుందని పేర్కొన్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్