Adivi Sesh Request to Nani :ఆ విషయంలో నానీని రిక్వెస్ట్ చేసిన అడివి శేష్..?

Published : Jul 23, 2022, 06:37 PM ISTUpdated : Jul 23, 2022, 06:39 PM IST
Adivi Sesh Request to Nani :ఆ విషయంలో నానీని రిక్వెస్ట్ చేసిన అడివి శేష్..?

సారాంశం

నేచురల్ స్టార్ నానీని అడివి శేష్ రిక్వెస్ట్ చేశారట. అవును నానీని శేష్ బ్రతిమలాడాడట. అది కూడా ఓ సినిమా విషయంలో. ఇంతకీ నానీని అడివి శేష్ ఎందుకు రిక్వెస్ట్ చేశాడు..? ఏ విషయంలో చేశాడు..?   

రీసెంట్ గా మేజర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టాడు అడివి శేష్. తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈసినిమాను పొంగడ్తలతో ముంచెత్తారు. ఇక ఈ సినిమా తరువాత శేష్  హిట్ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోన్న హిట్ 2 షూటింగ్ లో పాల్గోనబోతున్నాడు. అయితే ఈ విషయంలో అడివి శేష్ నానీకి చిన్న రిక్వెస్ట్ చేశాడట. 

నాని నిర్మాతగా విష్వక్సేన్ హీరోగా 2020లో వచ్చింది హిట్ సినిమా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలో సూపర్  సక్సెస్ ను సాధించింది.  కథాపరంగా ..  ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమాలో హీరోయిన్ లేదు, గ్లామర్ పార్ట్ లేదు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్  బ్యాక్ గ్రైండ్ తో సాగిన కథలో ట్రీట్మెంట్ పరంగా నెట్టుకొచ్చేసింది సినిమా. శైలేశ్ కొలను డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే చెప్పారు. 

ఇక హిట్  సీక్వెల్ గా హిట్ 2ను అనౌన్స్ చేశారు. అయితే ఈసారి హీరోగా విశ్వక్ సేన్ బదులు అడివి శేష్ హీరోగా రూపొందిస్తున్నారు. హిట్2 మూవీ చాలా వరకూ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే ఈ మధ్యలో అడివి శేష్ మేజర్ మూవీ బిజీలోకి వెళ్ళిపోయాడు. దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించాల్సి ఉండటం, మహేష్ బాబు నిర్మాత కావడం.. సినిమా రెస్పాన్స్ బులిటీ అంతా శేష్ పై ఉండటంతో.. హిట్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇవ్వక తప్పలేదు. 

అయితే హిట్ 2 నిర్మాత అయిన నానీ ఈ విషదయంలో శేష్ కు ఫుల్ గా సపోర్ట్ చేశాడు. షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. కాని   మేజర్ సినిమా  సక్సెస్ తరువాత కూడా తనకు మరికొంత సమయం కావాలని నానీని రిక్వెస్ట్ చేశాననీ, ఇక వచ్చేనెల నుంచి మళ్లీ షూటింగ్ మొదలవుతుందని అడివి  శేష్ రీసెంట్ గా వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. 

వచ్చేనెలలో జరిగే లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ తో ఈమూవీ  పూర్తవుతుందని శేష్ చెప్పాడు. హిట్ సినిమాలో హీరోయిన్ లేదు కాని.. హిట్ 2 కి మాత్రం గ్లామర్ టచ్ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాలో అడివి శేష్ జతగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మిట్ 2కి జాన్ స్టీవర్ట్  సంగీతాన్ని  సమకూర్చుతున్నాడు.  భానుచందర్, పోసాని, రావు రమేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?