ఎట్టకేలకు దిగొచ్చిన సింగర్ శ్రావణ భార్గవి... అన్నమయ్య వీడియో డిలీట్

Siva Kodati |  
Published : Jul 23, 2022, 06:41 PM ISTUpdated : Jul 23, 2022, 06:50 PM IST
ఎట్టకేలకు దిగొచ్చిన సింగర్ శ్రావణ భార్గవి... అన్నమయ్య వీడియో డిలీట్

సారాంశం

అన్నమయ్య కీర్తనపై ఆమె కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత వీడియో పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి. అయితే దీనిపై అన్నమయ్య వంశీకుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో వివాదాస్పద వీడియోను ఆమె యూట్యూబ్ నుంచి డిలీట్ చేశారు  

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ప్రముఖ నేపథ్య గాయని శ్రావణ భార్గవి ఎట్టకేలకు దిగొచ్చారు. యూట్యూబ్ నుంచి వివాదాస్పద వీడియోను ఆమె శనివారం డిలీట్ చేశారు. అన్నమయ్య కీర్తనపై ఆమె కొద్దిరోజుల క్రితం వ్యక్తిగత వీడియో పోస్ట్ చేశారు శ్రావణ భార్గవి. అయితే దీనిపై అన్నమయ్య వంశీకుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తా సంస్త ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

అసలేం జరిగిందంటే.. శ్రావణ భార్గవి తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన తాజా మ్యూజికల్ వీడియో వివాదంలో పడింది. అన్నమయ్య కీర్తనల్లో ఒకటైన `ఒకపరి ఒకపరి వయ్యారమే` అంటూ సాగే కీర్తనలతో  శ్రావణ భార్గవి దీనిని రూపొందించింది. ఇందులో తనే యాక్ట్ చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో విశేషమైన స్పందన లభిస్తుంది. అయితే శ్రావణ భార్గవి మ్యూజికల్ వీడియోను.. అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు, అన్నమయ్య వారసులు తప్పుబట్టారు. అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసేలా, కించపరిచేలా ఉన్నాయని అన్నమయ్య ట్రస్ట్ సభ్యులు ఆరోపిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలను శ్రావణ భార్గవి శృంగార కీర్తనలుగా మార్చిందని, వెంటనే వాటిని ఆ పాటని తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

ALso Read:శ్రావణ భార్గవి‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు.. తిరుపతిలో అడుగుపెట్టనివ్వమని వార్నింగ్..!

ఈ క్రమంలోనే అన్నమయ్య ట్రస్ట్‌ సభ్యునికి, శ్రావణ భార్గవికి మధ్య జరిగినట్టుగా చెబుతున్న ఆడియో క్లిప్‌ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు శ్రావణ భార్గవి వీడియోపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది శ్రావణ భార్గవిని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఈ క్రమంలోనే వివాదంపై శ్రావణ భార్గవి స్పందిస్తూ.. మహిళా గాయకులు పాటను విడుదల చేసినప్పుడే ప్రజలకు అభ్యంతరాలు ఉంటాయని అన్నారు. ‘‘ఈ వీడియోలో అశ్లీలత లేదు. అన్నమయ్య పాటను కించపరిచేలా లేదు. కేవలం మహిళా గాయకులు వీడియో, ఆడియో ఆల్బమ్‌లు విడుదల చేస్తే కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేసి వివాదాలు సృష్టిస్తారని.. అయితే మగ గాయకులు విడుదల చేసిన ఆల్బమ్‌లను పట్టించుకోరు’’ అని శ్రావణ భార్గవి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్