చివరి నిమిషంలో పవన్ అనూహ్య నిర్ణయం..! 

Published : Sep 17, 2022, 02:04 PM IST
చివరి నిమిషంలో పవన్ అనూహ్య నిర్ణయం..! 

సారాంశం

పవన్ బస్సు యాత్రకు బ్రేకులు పడ్డట్లు వార్తలు వస్తున్నాయి. మనసు మార్చుకున్న పవన్ తన యాత్రను వాయిదా వేస్తున్నట్లు సమాచారం అందుతుంది.

సినిమాలను పక్కన పెట్టిన పవన్ కళ్యాణ్ పూర్తి సమయం రాజకీయాలకు కేటాయిస్తున్నారు. ఆయన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటారని కథనాలు వెలువడుతున్నా అది జరగడం లేదు. మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు షూటింగ్ నిలిచి నెలలు గడిచిపోతుంది. అదిగో ఇదిగో మొదలవుతుంది అంటున్నా,అవి పుకార్లు గానే మిగిలిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని దృష్టిలో ఉంచుకొని పవన్ 2024 ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా అక్టోబర్ 5 నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు ప్రకటించారు. 

విజయదశమి నాడు ప్రారంభమయ్యే ఈ యాత్ర విజయవంతం కావాలని పవన్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ యాత్ర కోసం పవన్ ప్రత్యేకంగా కొన్ని వాహనాలు కొనుగోలు చేశారు. ఇక జనసేన వర్గాలు కూడా యాత్ర పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల జనసేన నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే పవన్ వాళ్ళ ఆశలపై నీళ్లు చల్లారట.  బస్సు యాత్ర ఆయన వాయిదా చేసుకున్నారట. అక్టోబర్ 5న పవన్ చేపట్టాల్సిన బస్సు యాత్ర ప్రారంభం కావడం లేదని విశ్వసనీయ సమాచారం. 

ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళతారని భావించిన పవన్ అక్టోబర్ నుండి బస్సు యాత్ర చేయాలని భావించారట. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం మాత్రమే ఉంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపించడం లేదు.ఇప్పుడు బస్సు యాత్ర ప్రారంభిస్తే ఐదారు నెలల్లో పూర్తి అవుతుంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉంటుంది. కాబట్టి ఎన్నికలకు ఓ ఆరు నెలల ముందు ఇలాంటి యాత్ర చేయడం ప్రయోజనకరం అనుకుంటున్నారట. 

ఈ క్రమంలో పవన్ బస్సు యాత్ర వాయిదా దాదాపు ఖాయమే అంటున్నారు. ఇది పవన్ కి అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలకు గుడ్ న్యూస్. బస్సు యాత్ర వాయిదా పడితే పవన్ ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే అవకాశం దొరుకుతుంది. కనీసం మధ్యలో ఉన్న హరి హర వీరమల్లు గట్టెక్కించవచ్చు. నిలకడలేని మనస్తత్వానికి మారుపేరైన పవన్ ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం కష్టమే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Retirement .. 3 సినిమాల తర్వాత సూపర్ స్టార్ రిటైర్మెంట్ ప్రకటించనున్నారా?
Bigg Boss Telugu 9: లేటెస్ట్ ఓటింగ్‌లో ఊహించని ట్విస్ట్.. డేంజర్‌ జోన్‌లోకి టాప్‌ కంటెస్టెంట్లు