'సీత' మూవీ ప్రీమియర్ షో టాక్!

By AN TeluguFirst Published 24, May 2019, 8:20 AM IST
Highlights

కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించగా.. 
సోనూసుద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. యూఎస్ ప్రీమియర్ షోలు ఇప్పటికే పూర్తయిన నేపథ్యంలో ఈ చిత్రానికి ఎలా టాక్ వస్తుందో చూద్దాం.

20 సంవత్సరాలు జ‌నాల‌కు దూరంగా, పొల్యూట్ కాకుండా పెరిగిన ఓ అబ్బాయి ఈ జ‌నార‌ణ్యంలోకి వచ్చిన అబ్బాయికి డ‌బ్బే స‌ర్వ‌స్వం అనుకునే అమ్మాయికి.. మధ్య ప‌రిచ‌యం ఏర్పడితే.. అది ఏ తీరాల‌కు దారి తీసింద‌నే ఆసక్తికరమైన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. కథలో దర్శకుడు సిద్ధం చేసుకున్న కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అంతగా వర్కౌట్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.

పాటలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. బిత్తిరి సత్తి కామెడీ ఓ మోస్తరుగా ఉందని అంటున్నారు. కథ మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని, ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసిందని టాక్. ఆమె పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయని చెబుతున్నారు. హీరోగా బెల్లంకొండ నటన కాస్త అతిగా ఉందని టాక్. విలన్ గా సోనూసూద్ నటన ఆకట్టుకుంది.

తనికెళ్లభరణి క్యారెక్టర్ ఆడియన్స్ ని మెప్పిస్తుంది. ఫస్ట్ హాఫ్ మెప్పిస్తుంది. సెకండ్ హాఫ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. థియేటర్లలో 'మహర్షి' తప్ప మరో సినిమా లేకపోవడం 'సీత'కి కలిసొచ్చే అంశం. మరి బాక్సాఫీస్ వద్ద ఏస్థాయిలో వసూళ్లు రాబడుతుందో చూడాలి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.  

Last Updated 24, May 2019, 8:20 AM IST