సీత మూవీ ట్విట్టర్ రివ్యూ!

Published : May 24, 2019, 07:59 AM IST
సీత మూవీ ట్విట్టర్ రివ్యూ!

సారాంశం

కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కాజల్ ప్రధాన పాత్రలో తేజ దర్శకత్వం వహించిన 'సీత' మూవీ మే 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ చిత్రంలో హీరోగా నటించగా.. సోనూసుద్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.

ఈ సినిమా ట్రైలర్, టీజర్ లతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేశారు. కాజల్ క్యారెక్టరైజేషన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్ షోలు కొన్ని చోట్ల ప్రదర్శించడంతో సినిమా టాక్ బయటకి వచ్చింది.

సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని, కాజల్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయని అంటున్నారు. సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుందని కాజల్ అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని అంటున్నారు. బెల్లంకొండ మాత్రం కాస్త విసిగించాడని టాక్.

సెకండ్ హాఫ్ తో పోలిస్తే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ గా ఉందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమాను ఒకసారి చూడొచ్చని అంటున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించగా.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో రాంబ్రహ్మం సుంకర నిర్మించారు.  

 

 

 

PREV
click me!

Recommended Stories

బాలకృష్ణ కెరీర్ లో ఎన్టీఆర్ వల్ల డిజాస్టర్ అయిన సినిమా ఏదో తెలుసా? దర్శకుడు ఎంత చెప్పినా రామారావు ఎందుకు వినలేదు?
Gunde Ninda Gudi Gantalu Today: ఏం ఫ్యామిలీ రా బాబు... ఒకరికి తెలియకుండా మరకొరు, మంచాలా మనోజ్ కి బాలు చెక్