Sirivennela Death: సాహిత్యానికి చీకటి రోజుః చిరంజీవి.. బాలయ్య, మోహన్‌బాబు, ఎన్టీఆర్‌, చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్

Published : Nov 30, 2021, 07:02 PM IST
Sirivennela Death: సాహిత్యానికి చీకటి రోజుః చిరంజీవి.. బాలయ్య, మోహన్‌బాబు, ఎన్టీఆర్‌, చరణ్‌ ఎమోషనల్‌ పోస్ట్

సారాంశం

`సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి, సాహిత్యానికి చీకటి రోజు` అని అన్నారు చిరంజీవి. సిరివెన్నెల మరణం పట్ల చిరు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. మోహన్‌బాబు, బాలయ్య, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ వంటి వారు సంతాపం తెలిపారు.

`సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry Death) మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి, సాహిత్యానికి చీకటి రోజు` అని అన్నారు చిరంజీవి. సిరివెన్నెల మరణం పట్ల చిరు తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. సిరివెన్నెల మంగళవారం సాయంత్రం 4.07గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన విషయం తెలిసిందే. లంగ్స్ క్యాన్సర్‌తో చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. దీంతో Sirivennela Seetharama Sastry Death మరణంగా చిత్ర పరిశ్రమ షాక్‌కి గురైంది. ఓ మహా పాటల ప్రవాహం ఆగిపోయిందంటూ తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 

చిరంజీవి తన సంతాపాన్ని వెల్లడించారు. ట్విట్టర్‌ ద్వారా తన సుధీర్ఘ పోస్ట్ పెట్టారు. `సిరివెన్నెల సినీ కళామతల్లికి ఎనలేని సేవలందించారు. వేటూరి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన్ని కోల్పోతే సొంత బంధువుని కోల్పోయినట్టుగా ఉంది. గుండె తరుక్కుపోతుంది. గుండెంతా బరువెక్కి పోతుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. ఆయన మరణం సాహిత్యానికి చీకటి రోజు` అని అన్నారు. 

మోహన్‌బాబు స్పందిస్తూ, సిరి వెన్నెల సీతారామశాస్త్రి... నాకు అత్యంత సన్నిహితుడు. సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి` అని ట్వీట్‌ చేశారు.

బాలకృష్ణ సంతాపం తెలియజేస్తూ, తెలుగు పాట‌ని త‌న సాహిత్యంతో ద‌శ‌దిశ‌ల వ్యాపింప‌జేసిన ప్ర‌ముఖ గేయ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను న‌టించిన చిత్రాల‌కు వారు అద్భుత‌మైన పాట‌లు రాయ‌డం జ‌రిగింది. సినిమా పాట‌కు సాహిత్య గౌర‌వాన్ని క‌లిగించిన వ్య‌క్తి సిరివెన్నెల గారు. ఆయ‌న‌ ఈ రోజు మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం చాలా భాధాక‌రం. వారి ప‌విత్ర ఆత్మ‌కు శాంతి చేకూర్చాల‌ని ఆ భ‌గ‌వంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంభ స‌భ్యుల‌కు నా ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నా` అని ట్విట్టర్‌ ద్వారా నంద‌మూరి బాల‌కృష్ణ‌ సంతాపం తెలిపారు.

ఎన్టీఆర్‌ స్పందిస్తూ, `సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నా` అని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రామ్‌చరణ్‌ స్పందిస్తూ, `సిరివెన్నెల మరణవార్త తెలిసి దిగ్ర్భాంతికి గురయ్యాను. చాలా బాధగా ఉంది. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `సైరా` కోసం ఆయన చేసిన విలువైన మాటలు నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోయాయి. సాహిత్యం, తెలుగు సినిమాకి ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా` అని తెలిపారు. 

దర్శకుడు మెహర్‌ రమేష్‌ సంతాపం తెలియజేస్తూ, మన తెలుగు భాష సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కోల్పోయింది.కలంతో, కాగితంతో అయన  చేసిన స్నేహం అమరం. మహాకవి కి కన్నీటి వీడ్కోలు` అని ట్వీట్‌ చేశారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి మృతదేహం రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శన కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఉంచనున్నారని, ఈ రోజు కిమ్స్ హాస్పిటల్లో నే సిరివెన్నెల మృతదేహాన్ని ఉంచనున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. రేపు(బుధవారం) సాయంత్రం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

also read: Sirivennela Seetharama Sastry Death: చైతన్యాన్ని తట్టిలేపే సిరివెన్నెల టాప్‌ సాంగ్స్..

also read: Sirivennela Seetharama Sastry Death: డాక్టర్‌ కాదని రైటర్‌ అయ్యాడు.. సిరివెన్నెల టాలెంట్‌ని గుర్తించిన తమ్ముడు

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా