Sirivennela: సిరివెన్నెల మృతికి కారణం ఇదే, 50 శాతం ఊపిరితిత్తులతోనే.. కిమ్స్ ఎండీ

By telugu teamFirst Published Nov 30, 2021, 6:59 PM IST
Highlights

లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు.

లెజెండ్రీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry Dead) (66)కన్నుమూశారు. గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్ప పొందుతూ మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న సిరివెన్నెల ఈ నెల 24నే ఆసుపత్రిలో చేరారు.  మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 

సిరివెన్నెల మృతిపై కిమ్స్ ఆసుపత్రి ఎండీ డాక్టర్ భాస్కర రావు స్పందించారు. సిరివెన్నెల మృతికి గల కారణాలు వివరించారు. ఆరేళ్ళ క్రితమే సిరివెన్నెల కాన్సర్ సోకింది. దీనితో అప్పుడే సగం ఊపిరి తిత్తు తీసేయాల్సి వచ్చింది. వారం క్రితం మరో ఊపిరి తిత్తుకి కూడా క్యాన్సర్ సోకడంతో సగం తీసేశారు. రెండ్రోజుల తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో కిమ్స్ కి తీసుకువచ్చారు. కిమ్స్ లో మొదటి రెండు రోజులు వైద్యానికి స్పందించారు. 

మిగిలిన 50 శాతం లంగ్స్ కి ఇన్ఫెక్షన్ సోకింది. గత ఐదు రోజులుగా ఆయన ఎక్మో మిషన్ పైనే ఉన్నారు. దీనికి తోడు కిడ్నీ కూడా డ్యామేజ్ కావడంతో ఇన్ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించింది. దీనితో కండిషన్ క్రిటికల్ గా మారి మంగళవారం 4 గంటలకు మరణించినట్లు కిమ్స్ ఎండీ తెలిపారు. 

Also Read: Sirivennela: పంజా మూవీలో ఆ సాంగ్.. రామజోగయ్య శాస్త్రికి వార్నింగ్ ఇచ్చిన సిరివెన్నెల

శ్రుతిలయలు, స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఎన్నో చిత్రాలకు సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. సిరివెన్నెల తన కెరీర్ లో 3 వేలకు పైగా పాటలు రాశారు. కానీ ఎప్పుడూ ఆయన విలువలు వదిలిపెట్టలేదు. సిరివెన్నెల పాటల్లో ఒక్క చెడు మాటనైనా కనిపెట్టడం కష్టం. సిరివెన్నెల ఆహ్లాదభరితమైన పాటలు, ప్రేమ పాటలు.. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని అంటూ సమాజాన్ని ఆలోచింపజేసే పాటలు ఎన్నో రాశారు.

 

click me!