
ఏసీ కారుల్లో తిరుగుతూ ఎండ కన్నెరగని కోటీశ్వరులు... రోడ్డు ప్రక్క చాకిరీ చేస్తూ కనిపిస్తే ఎవరైనా నమ్మగలరా?. షాక్ తినకుండా ఉండగలరా? అంటే ఖచ్చితంగా ఉండలేరు. సింగర్ సునీత చెరకు రసం గిర్నీ తిప్పడం జనాలకు అంతే షాక్ ఇచ్చింది. సమ్మర్ లో జనాల దాహార్తి తీర్చడానికి చిన్నా చితకా వ్యాపారులు చల్లని పానీయాలు అమ్ముతూ ఉంటారు. ఎండాకాలం మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ లలో చెరకు రసం బండి కూడా ఒకటి. ఈ చెరకు గడల నుండి రసం తీయడానికి చాలా మంది విద్యుత్తుతో నడిచే క్రషర్స్ వాడతారు. కొందరు వ్యాపారులు మాత్రం మనుషులు తిప్పే గానుగ యంత్రం వాడతారు.
సింగర్ సునీత(Singer Sunitha) ఈ చెరకు రసం గానుగను తిప్పారు. అయితే ఇదంతా ఆమె సరదా కోసం చేశారు. సునీత కారులో వెళుతూ రోడ్డు ప్రక్కన ఉన్న చెరకు రసం బండి దగ్గర ఆగారు.ఆ పానీయం తాగడంతో పాటు పనిలో పనిగా చెరకు రసం తీసే ఆ గిర్నీ తిప్పాలనే సరదా తీర్చుకున్నారు. చెరకు రసం తీస్తున్న వీడియో సునీత తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఆమె ఫ్యాన్స్ సదరు వీడియో పై పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.
రెండో వివాహం తర్వాత సునీత సోషల్ మీడియా జీవిగా మారిపోయారు. ఆమె తరచుగా వ్యక్తిగత, వృత్తిపరమైన ఫోటోలు, విషయాలు ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. ఇటీవల తన ఫార్మ్ హౌస్ లోని మామిడి చెట్టుకు కాసిన కాయల పక్కన కూర్చొని ఫోటో దిగి, 'బ్లెస్సెడ్' అంటూ కామెంట్ చేశారు. సునీత పోస్ట్ చూసిన జనాలు తప్పుగా అర్థం చేసుకున్నారు. సునీత తల్లయ్యారంటూ కథనాలు వల్లించారు. సదరు వార్తలకు కంగుతిన్న సునీత... మీకు దండంరా బాబు అలాంటిది ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు.
అటు కెరీర్ పరంగా కూడా సునీత సక్సెస్ ట్రాక్ లో వెళుతున్నారు. పాడుతా తీయగా లేటెస్ట్ సీజన్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆమె పలు బుల్లితెర కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. సునీత కూతురు సింగర్ గా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.