Liger Update: వేట స్టార్ట్ చేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌

Published : May 04, 2022, 05:05 PM IST
Liger Update: వేట స్టార్ట్ చేసిన విజయ్‌ దేవరకొండ.. ఫ్యాన్స్ కి మరో సర్‌ప్రైజ్‌

సారాంశం

తాను నటిస్తున్న `లైగర్‌`  చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ `లైగర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

`రౌడీబాయ్‌` విజయ్‌ దేవరకొండ కాస్త ఇప్పుడు `లైగర్‌` అయ్యారు. తాను నటిస్తున్న సినిమా పేరునే లైగర్‌గా మార్చుకున్నారు. ఇప్పుడు వేట స్టార్ట్ చేయబోతున్నారు. అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. తాను నటిస్తున్న `లైగర్‌`  చిత్రం నుంచి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో విజయ్‌ దేవరకొండ `లైగర్‌` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్‌ ఇండియా మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. 

ప్రపంచ లెజెండరీ బాక్సర్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలకు సిద్ధమవుతుంది. దీంతో ఇప్పటి నుంచి ప్రమోషన్‌ షురూ చేసింది యూనిట్‌. లైగర్‌ హంటింగ్‌ పేరుతో మరో సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు. ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారు. ఈ చిత్రంలో నుంచి ఓ స్పెషల్‌ థీమ్‌ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారని తెలుస్తుంది. ఈ నెల 9న సాయంత్రం నాలుగు గంటలకు ఈ సర్‌ప్రైజ్‌ రాబోతుందట. 

ఇప్పటికే ఈ చిత్రం నుంచి గ్లింప్స్ వచ్చి ఆకట్టుకుంది. హీరో పాత్రని పరిచయం చేసేలా ఉన్న ఆ గ్లింప్స్ అంచనాలను పెంచింది. ఇప్పుడు రాబోయే థీమ్‌ సాంగ్‌ వీడియో మరింతగా ఆకట్టుకుంటుందని, గూస్‌బంమ్స్ తెప్పించేలా ఉంటుందని సమాచారం. తాజాగా ఆ విషయాన్ని విజయ్‌ దేవరకొండ తెలిపారు. తాను ఆకలితో ఉన్నానని, ఇండియా కూడా ఆకలిగా ఉందని, అసలు మ్యాటర్‌ విప్పే టైమ్‌ వచ్చిందని పేర్కొన్నారు. ఈ అప్‌డేట్‌తో రౌడీ బాయ్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

ఇక ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో సినిమా రిలీజ్‌ కానుంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, ధర్మ ప్రొడక్షన్స్ పతాకాలపై ఛార్మి, కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ram Charan : హైదరాబాద్ లో రామ్ చరణ్ బంగ్లా లోపల ఎలా ఉందో చూశారా?
4000 కోట్ల రామాయణం పై బిగ్ అప్‌డేట్.. అభిమానులకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఎప్పుంటే?