Bigg Boss Telugu 6: `బిగ్‌ బాస్` పై సింగర్‌ స్మితకి అంత కోపమా?..చచ్చినా ఆ పని చేయనంటూ వ్యాఖ్యలు..

Published : Sep 06, 2022, 06:39 AM ISTUpdated : Sep 06, 2022, 07:40 AM IST
Bigg Boss Telugu 6: `బిగ్‌ బాస్` పై సింగర్‌ స్మితకి అంత కోపమా?..చచ్చినా ఆ పని చేయనంటూ వ్యాఖ్యలు..

సారాంశం

రియాలిటీ షో బిగ్‌ బాస్‌ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ షోపై తాజాగా సింగర్‌ స్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తప్పు చేయనని స్పష్టం చేశారు.

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్‌ బాస్‌(Bigg Boss) కి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న విషయం తెలిసిందే. దీనికి ఇండియాలోనూ మంచి ఆదరణ దక్కుతుంది. అదే సమయంలో కొన్ని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. షో ప్రారంభమైన ప్రతి సారి రాజకీయ నాయకులు, కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక బూతు షో అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగర్‌ స్మిత(Singer Smita) కూడా దీనిపై విమర్శలు చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ బిగ్‌ బాస్‌ షో తనకు అస్సలు నచ్చదని, ఒకవేళ బిగ్‌ బాస్‌ నుంచి ఆఫర్‌ వస్తే చచ్చినా వెళ్లనని తెగేసి చెప్పింది. పొరపాటున కూడా ఒప్పుకుని తప్పు చేయనని వెల్లడించింది. ఫ్యామిలీని వదిలేసి అన్ని రోజులు హౌజ్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. నెలలపాటు సెలబ్రిటీలను రూమ్‌లో బంధించి ఇక తన్నుకోండి మేం చూస్తాం,మా టీఆర్పీలను పెంచుకుంటామంటే ఎంత వరకు కరెక్ట్ అంటూ మండి పడింది. 

అంతేకాదు అసలు బిగ్‌ బాస్‌ షోనే తాను చూడనని, ఒకవేళ చూసినా తనకు అర్థం కాదని చెప్పింది. తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ షోకి వెళ్లనని మరోసారి స్పష్టం చేసింది సింగర్‌ స్మిత. అంతేకాదు తన స్నేహితుల్లో ఎవరైనా వెళ్తా అంటే వెళ్లాల్సిన కర్మ ఏమొచ్చిందని వారిస్తానని, వెళ్లిన వాళ్ల గురించి తానే కామెంట్ చేయనని చెప్పింది. ఈ సీజన్‌లో తనకు తెలిసిన వాళ్లు వెళ్లారని, అందుకే దీని గురించి ఏం మాట్లాడినా అది వారిని విమర్శించినట్టు అవుతుందని చెప్పింది. ఇదిలా ఉంటే సింగర్ల విభాగం నుంచి ఈ సారి రేవంత్‌ కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. 

బిగ్‌ బాస్‌ తెలుగు ఇప్పటికే ఐదు సీజన్లని పూర్తి చేసుకుంది. ఓ ఓటీటీ షో కూడా పూర్తయ్యింది. తాజాగా బిగ్‌ బాస్‌ తెలుగు 6(Bigg Boss Telugu 6) రెండు రోజుల క్రితమే ప్రారంభమైన విషయం తెలిసిందే. 105 రోజులపాటు సాగే ఈ షోలో తాజాగా 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. సినీ, యూట్యూబ్‌, టీవీ, మోడలింగ్‌రంగాలకు చెందిన వాళ్లు ఇందులో పాల్గొనడం విశేషం. ఈ సారి కూడా నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు. మరోవైపు సింగర్‌ స్మిత ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారమవుతున్న `సూపర్ సింగర్‌ ఐకాన్‌` షోకి జడ్జ్ గా వ్యవహరిస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి కి పచ్చి అబద్దం చెప్పిన అల్లు అరవింద్, నెక్ట్స్ ఏం జరిగిందో తెలుసా?
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?