కండోమ్‌ ప్యాకెట్లు అడిగిన తమన్నా.. ఏం చేయబోతుంది.. అదరగొడుతున్న `బబ్లీ బౌన్సర్‌` ట్రైలర్‌

Published : Sep 05, 2022, 04:40 PM ISTUpdated : Sep 05, 2022, 04:41 PM IST
కండోమ్‌ ప్యాకెట్లు అడిగిన తమన్నా.. ఏం చేయబోతుంది.. అదరగొడుతున్న `బబ్లీ బౌన్సర్‌` ట్రైలర్‌

సారాంశం

మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు షాకిచ్చింది. పబ్లిక్‌గా కండోమ్‌ ప్యాకెట్‌ కొనుక్కోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఇంతకి ఏం జరిగిందంటే..

తమన్నా(Tamanna) వెర్సటైల్‌ యాక్టర్‌గా రాణించేందుకు ప్రయత్నిస్తుంది. ఆమె `మ్యాస్ట్రో` చిత్రం నుంచే ఆమె తన పంథా మార్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రంతో రాబోతుంది. జాతీయ అవార్డు చిత్రాలు రూపొందించిన మెప్పించిన మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో `బబ్లీ బౌన్సర్‌` (Babli Bouncer)అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఈ నెల 23న డిస్ట్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. 

`బబ్లీ బౌన్సర్‌`(Babli Bouncer trailer) చిత్ర ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో తమన్నా నటన అదరగొడుతుంది. కామెడీ పంచుతూనే యాక్షన్‌ సీన్స్ తో ఆదగొట్టింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగుతోపాటు సౌత్‌ భాషల్లోనూ రిలీజ్‌ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె పాన్‌ ఇండియా హీరోయిన్‌గా మారిపోయిందని చెప్పొచ్చు. ఇక ట్రైలర్‌ని బట్టి ఇందులో తమన్నా లేడీ పహిల్వాన్‌(బౌన్సర్‌)గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ ఊర్లో మగవాళ్లు అంతా పహిల్వాన్లే, అలా తమన్నా కూడా పహిల్వాన్‌ కావాలనుకుంటుంది. 

మరి పహిల్వాన్‌ అయ్యాక తమన్నా ఏం చేసింది, సమాజంలోని ఆగడాలను ఎలా ఎదుర్కొంది, తాను పహిల్వాన్‌గా ఎలా నిలిచిందనేది ఈచిత్రం కథగా ఉండబోతుందని తెలుస్తుంది. లేడీ పహిల్వాన్‌గా తమన్నా విశ్వరూపం చూపిస్తుందని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇందులో ఆమె మెడికల్‌ షాప్‌కి వెళ్లి రెండు కండోమ్‌ ప్యాకెట్లు కొనుక్కోవడం షాకిస్తుంది. మరి ఆ కండోమ్‌ ప్యాకెట్ల కథేంటి? ఏం చేయబోతుందనేది ఇందులో ఆసక్తికరం. ఆమె పాత్ర డేరింగ్‌గా, బోల్డ్ గా, కామెడీని పంచేలా ఉండటం విశేషం. ఓరకంగా ఈ చిత్రంతో ఫ్యాన్స్ కి తన విశ్వరూపం చూపించబోతుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని స్టార్ స్టూడియోస్, జంగిలీ పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. 

తమన్నా తెలుగులో చిరంజీవితో `భోళా శంకర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు సత్యదేవ్‌తో కలిసి `గుర్తుందా శీతాకాలం` చిత్రంలో నటించింది. ఇది ఈ నెలలోనే రిలీజ్‌ కాబోతుంది. మరోవైపు వరుసగా బాలీవుడ్‌ ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. అలాగే మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ దిలీప్‌కుమార్‌తో కలిసి ఓ సినిమాలో నటించనుంది. ఇటీవలే ఇది ప్రారంభమైంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా