ప్రముఖ గాయకుడు నితిన్ మృత్యువాత!

Published : Oct 10, 2018, 08:01 AM IST
ప్రముఖ గాయకుడు నితిన్ మృత్యువాత!

సారాంశం

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి మరణించారు. సింగర్ గా ఎన్నో పాటలు పాడిన ఆయన ఆరుకి పైగా ఆల్బమ్స్ కూడా చేశారు. అవన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. 

ప్రముఖ బాలీవుడ్ గాయకుడు నితిన్ బాలి మరణించారు. సింగర్ గా ఎన్నో పాటలు పాడిన ఆయన ఆరుకి పైగా ఆల్బమ్స్ కూడా చేశారు. అవన్నీ కూడా మంచి రెస్పాన్స్ ని దక్కించుకున్నాయి. ఆరేళ్ల క్రితం ఆయన మ్యూజిక్ ఇండస్ట్రీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు.

సోమవారం రాత్రి మాలద్ నుండి బోరివిల్లిలో ఉన్న తన ఇంటికి వెళ్తోన్న క్రమంలో.. నితిన్ బాలి కారు డివైడర్ ని ఢీకొట్టింది. వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. తలకి, ముఖానికి గాయాలు కావడంతో వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపించారు.

అయితే ఇంటికి వెళ్లిన తరువాత నితిన్ రక్తపు వాంతులు చేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. బీపీ లెవెల్స్ పెరిగిపోవడంతో ఆయన ఇంట్లోనే కుప్పకూలిపోయారు. ఒక్కసారిగా హార్ట్ రేటు పడిపోయినట్లు తెలుస్తోంది.

వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి తీసుకెళ్లినా.. ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయారు. ఈరోజు నితిన్ అంత్యక్రియలు జరిగే అవకాశముంది. 

PREV
click me!

Recommended Stories

పొగరు అనుకున్నా పర్లేదు.! రామ్ చరణ్ 'పెద్ది' మూవీ ఆఫర్ అందుకే రిజెక్ట్ చేశా
Chiranjeevi: చిరంజీవితో పోటీ, అది నచ్చకే ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోయా.. నిజాలు బయటపెట్టిన క్రేజీ హీరో